Telangana Assembly: తెలంగాణ శాసనసభ నిరవధిక వాయిదా.. మొత్తం పని చేసిన గంటలు ఎన్ని అంటే?

తెలంగాణ శాసనసభ నిరవధిక వాయిదా పడింది.

Update: 2024-12-21 11:02 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ శాసనసభ (Telangana Legislative Assembly) నిరవధిక వాయిదా (Ajourned sine die) పడింది. డిసెంబర్ 9న ప్రారంభమైన శాసనసభ సమావేశాలు ఈ నెల 21 వ తేదీ (శనివారం) వరకు కొనసాగాయి. మొత్తంగా 7 రోజులు శాసనసభ సమావేశాలు కొనసాగా, ఈ సెషన్ లో సభ మొత్తం 37 గంటల 44 నిమిషాల పాటు సాగినట్లు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ (Speaker Gaddam Prasad Kumar) వెల్లడించారు. ఈ సెషన్ లో సభ మొత్తం 8 బిల్లులకు ఆమోదం తెలిపింది. చివరి రోజు రైతుభరోసాపై స్వల్ప వ్యవధి చర్చ ముగిసింన తర్వాత నిరవధిక వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు.  బీజేపీ సభ్యులు ఏలేటి మహేశ్వర్ రెడ్డి, పాయల్ శంకర్  ఆరు గ్యారెంటీల్లోని మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఆర్థిక సహాయం అందించాలని ఇచ్చిన వాయిదా ప్రతిపాదనును, సీపీఐ సభ్యుడు కూనంనేని సాంబశివరావు ఇచ్చిన రాష్ట్రంలోని ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని ఇచ్చిన వాయిదా ప్రతిపాదనను స్పీకర్ తిరస్కరించారు.

Tags:    

Similar News