ఢిల్లీకి చేరుకున్న ‘పద్మ శ్రీ గ్రహీత కనకరాజు’
దిశ, జైనూర్ : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జైనూర్ మండలం మర్లవాయ్ గ్రామానికి చెందిన ‘గుస్సాడి కనకరాజు’ దేశ అత్యున్నత పురస్కారం ‘పద్మ శ్రీ’ అవార్డుకు ఎంపికైన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కనకరాజు ఆదివారం దేశ రాజధాని ఢిల్లీకి ప్రయాణం అయ్యారు. ఆదివాసీల సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతిబింబమైన గుస్సాడి నృత్యాన్ని ఇతరులకు నేర్పించడంతో పాటు ఎంతో ప్రాచీనమైన కళను ఇంకా బతికిస్తున్నందుకు గాను ఈ ఏడాదికి కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో ఆయన్ను గౌరవించింది. ఈ […]
దిశ, జైనూర్ : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జైనూర్ మండలం మర్లవాయ్ గ్రామానికి చెందిన ‘గుస్సాడి కనకరాజు’ దేశ అత్యున్నత పురస్కారం ‘పద్మ శ్రీ’ అవార్డుకు ఎంపికైన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కనకరాజు ఆదివారం దేశ రాజధాని ఢిల్లీకి ప్రయాణం అయ్యారు. ఆదివాసీల సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతిబింబమైన గుస్సాడి నృత్యాన్ని ఇతరులకు నేర్పించడంతో పాటు ఎంతో ప్రాచీనమైన కళను ఇంకా బతికిస్తున్నందుకు గాను ఈ ఏడాదికి కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో ఆయన్ను గౌరవించింది. ఈ నెల 9న ప్రెసిడెన్షియల్ భవనంలో ఈ అవార్డు కార్యక్రమం జరగనుంది. ఇందులో భాగంగానే పద్మశ్రీ అవార్డును అందుకోవడానికి కనకరాజు ఢిల్లీకి చేరుకున్నారు.