లిక్విడ్ ఆక్సిజన్ తీసుకెళ్తున ట్యాంకర్ మిస్సింగ్.. కేసు నమోదు

దిశ, వెబ్ డెస్క్ : దేశంలో కరోనా విజృంభణ కారణంగా మెడికల్‌ ఆక్సిజన్‌ కొరతతో పలు రాష్ట్రాలు సతమతమవుతున్నాయి. ఆక్సిజన్ కొరత తీర్చాలని పలు రాష్ట్రాలు కేంద్రాన్ని కోరుతున్నాయి. ఈ నేపథ్యంలో హర్యానాలోని లిక్విడ్‌ ఆక్సిజన్‌ను తీసుకెళ్తున్న ట్యాంకర్‌ అదృశ్యం కావడం కలకలం సృష్టించింది. హర్యానాలోని పానిపట్‌ నుంచి సిర్సాకు ఆక్సిజన్‌ లోడుతో వెళ్తున్న ట్యాంకర్‌ అదృశ్యమైంది. దీంతో పానిపట్ జిల్లా డ్రగ్‌ కంట్రోలర్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. పానిపట్‌ […]

Update: 2021-04-23 08:59 GMT

దిశ, వెబ్ డెస్క్ : దేశంలో కరోనా విజృంభణ కారణంగా మెడికల్‌ ఆక్సిజన్‌ కొరతతో పలు రాష్ట్రాలు సతమతమవుతున్నాయి. ఆక్సిజన్ కొరత తీర్చాలని పలు రాష్ట్రాలు కేంద్రాన్ని కోరుతున్నాయి. ఈ నేపథ్యంలో హర్యానాలోని లిక్విడ్‌ ఆక్సిజన్‌ను తీసుకెళ్తున్న ట్యాంకర్‌ అదృశ్యం కావడం కలకలం సృష్టించింది. హర్యానాలోని పానిపట్‌ నుంచి సిర్సాకు ఆక్సిజన్‌ లోడుతో వెళ్తున్న ట్యాంకర్‌ అదృశ్యమైంది. దీంతో పానిపట్ జిల్లా డ్రగ్‌ కంట్రోలర్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. పానిపట్‌ ప్లాంట్‌లో లిక్విడ్‌ ఆక్సిజన్‌ను నింపిన తర్వాత ట్రక్కు సిర్సాకు బయల్దేరినట్టు అధికారులు చెప్పారు. అయితే, ఆ వాహనం మాత్రం సిర్సాకు చేరుకోలేదు.

 

Tags:    

Similar News