ఆక్సిజన్ అయిపోయింది.. ఇప్పుడెలా..?
దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలో కరోనా సెకండ్ వేవ్ మరణ మృదంగం మోగిస్తున్న విషయం తెలిసిందే. ఇలాంటి విపత్కర సమయంలో విజయవాడ నగరంలో ఆక్సిజన్ నిల్వలు పూర్తి స్థాయిలో నిండుకున్నట్లు తెలుస్తోంది. ఒక్క డ్రాప్ కూడా లేదని అక్కడి ఆక్సిజన్ సప్లయర్స్ చేతులెత్తేశారు. ఉన్న కొద్దిపాటి ఆక్సిజన్‌ను ప్లాంట్స్ నుంచి ప్రభుత్వ ఆస్పత్రి వర్గాలు తీసుకెళ్లాయి. అయితే, విజయవాడలో ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఆక్సిజన్ వెంటిలేటర్లపై వందలాది మంది కొవిడ్ పేషెంట్లు చికిత్స పొందుతున్నారు. ఆక్సిజన్ సరఫరా […]
దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలో కరోనా సెకండ్ వేవ్ మరణ మృదంగం మోగిస్తున్న విషయం తెలిసిందే. ఇలాంటి విపత్కర సమయంలో విజయవాడ నగరంలో ఆక్సిజన్ నిల్వలు పూర్తి స్థాయిలో నిండుకున్నట్లు తెలుస్తోంది. ఒక్క డ్రాప్ కూడా లేదని అక్కడి ఆక్సిజన్ సప్లయర్స్ చేతులెత్తేశారు. ఉన్న కొద్దిపాటి ఆక్సిజన్‌ను ప్లాంట్స్ నుంచి ప్రభుత్వ ఆస్పత్రి వర్గాలు తీసుకెళ్లాయి.
అయితే, విజయవాడలో ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఆక్సిజన్ వెంటిలేటర్లపై వందలాది మంది కొవిడ్ పేషెంట్లు చికిత్స పొందుతున్నారు. ఆక్సిజన్ సరఫరా లేక ఆస్పత్రులు నానా అవస్థలు పడుతున్నాయి. కొన్ని ఆస్పత్రుల్లో అయితే మరో 4 గంటలకు మించి ఆక్సిజన్ నిల్వలు లేవని తెలుస్తోంది. త్వరితగతిన విజయవాడకు ఆక్సిజన్ సరఫరా జరగకపోతే ఆస్పత్రుల్లో మరణాల సంఖ్య రెట్టింపు అయ్యే చాన్స్ ఉందని ఆస్పత్రుల్లోని వైద్యులు చెబుతున్నారు.