Weather: బంగాళాఖాతంలో వాయుగుండం.. ఆంధ్ర ప్రదేశ్‌లో ఆ జిల్లాలపై తీవ్ర ప్రభావం

బంగాళాఖాతం(Bay of Bengal)లో ఏర్పడిన అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారింది.

Update: 2024-11-26 02:56 GMT

దిశ, వెబ్ డెస్క్: బంగాళాఖాతం(Bay of Bengal)లో ఏర్పడిన అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారింది. ఇది ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh), తమిళనాడు(Tamil Nadu) రాష్ట్రాలతో పాటు అండమాన్, నికోబార్ దీవులు(Andaman and Nicobar Islands), పుదుచ్చేరి(Puducherry)లలో కూడా తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని వాతావరణ శాఖ(Meteorological Department) వర్గాలు వెల్లడించాయి. బలపడిన వాయుగుండం తమిళనాడు మీదుగా శ్రీలంక(Sri Lanka) వైపు కదులుతున్నది. ప్రస్తుతం ఇది ట్రింకో మాల్ కు 380 కిలో మీటర్లు, నాగపట్నంకు 650 కిలో మీటర్లు, చెన్నైకి 800 కిలో మీటర్ల దూరంలో కేంద్రీకృతం అయ్యింది. దీంతో వాతావరణ శాఖ తమిళనాడు, ఆంధ్ర ప్రదేశ్, అండమాన్, నికోబార్ దీవులు, పుదుచ్చేరి ప్రభుత్వాలను అప్రమత్తం చేసింది. దీని ప్రభావంతో రెండు రోజుల్లో నెల్లూరు, తిరుపతి, ప్రకాశం జిల్లాలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, గుంటూరు, కృష్ణ, ఉభయ గోదావరి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని సమాచారం అందించింది. అలాగే దక్షిణ కోస్తా తీర ప్రాంతాల్లో 50 నుండి 70 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్ళొద్దని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

Tags:    

Similar News