viral: ఇదేం పిచ్చిరా నాయన.. మద్యం మత్తులో కరెంట్ స్తంభం వైర్లపై నిద్ర

న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా ఓ వ్యక్తి హల్ చల్ చేశాడు.

Update: 2025-01-01 06:08 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: మద్యం మత్తులో కొంత మంది చేసే వీరంగం అంతా ఇంతా ఉండదు. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా మందుబాబులు అనేక చోట్ల రెచ్చిపోయారు. మమ్మల్ని ఎవడ్రా ఆపేది అనే రేంజ్ లో హల్చల్ చేశారు. ఎవరి సంగతి ఎలా ఉన్నా మద్యం సేవించి ఓ వ్యక్తి విద్యుత్ స్తంభం ఎక్కి ఏకంగా కరెంట్ తీగలపై  (Drunked Man Hulchul) పడుకున్న తీరు తీవ్ర కలకలం రేపింది. మన్యం జిల్లా (Manyam District) పాలకొండ మండలం ఎం.సింగిపురంలో ఓ వ్యక్తి మద్యం మత్తులో విద్యుత్ స్తంభం ఎక్కడం మొదలుపెట్టాడు. కిందకు దిగమని ఎంత వేడుకున్నా ఆగకుండా పైకి వెళ్లి ఏకంగా విద్యుత్ తీగలపైనే దర్జాగా పడుకున్నాడు. అతంటితో ఆగకుండా కాసేపు అక్కడ విన్యాసాలు చేసి అందరిని హడలెత్తించాడు. అంతకు ముందు స్తంభం ఎక్కడం చూసిన స్థానికులు ట్రాన్స్ ఫార్మర్ బంద్ చేయడంతో పెను ప్రమాదం తప్పింది. చివరకు అందరూ కలిసి బలవంతంగా అతడిని కిందకు తీసుకురావడంతో కథ సుఖాంతం అయింది.

Tags:    

Similar News