తమిళనాడులో భారీగా తగ్గిన దిగుబడి.. ఏపీ కొబ్బరికాయలకు పెరిగిన డిమాండ్

తమిళనాడులో భారీగా దిగుబడి తగ్గిపోవడంతో ఏపీ కొబ్బరికాయలకు డిమాండ్ పెరిగింది...

Update: 2025-01-04 02:30 GMT

దిశ, పాలకొల్లు: కొబ్బరికాయలకు డిమాండ్ పెరిగింది. గత నెల రోజులుగా కొబ్బరికాయలకు మంచి ధర లభిస్తోంది. వెయ్యి కాయలకు సైజును బట్టి పదివేల రూపాయలు మొదలుకొని 18 వేల రూపాయల వరకు ధర పలుకుతోంది. దీనికి కారణం తమిళనాడులో కొబ్బరికాయలు దిగుబడి అమాంతంగా పడిపోవడమే అని అంటున్నారు. తూర్పు పశ్చిమగోదావరి జిల్లా నుంచి ఇతర రాష్ట్రాలకు నిత్యం వందలాది లారీల్లో కొబ్బరికాయలు ఎగుమతి అవుతుంటాయి. కొబ్బరి చెట్ల నుంచి కొబ్బరికాయలను దింపినందుకు ఒక్కొక్క కాయకి రెండు రూపాయలు చొప్పున దింపు కార్మికులు తీసుకుంటున్నారు. కొబ్బరి ధర పెరిగిందని సంతోషం వస్తున్నప్పటికీ ఒక్కో కాయకి రెండు రూపాయలు చొప్పున దింపు కార్మికులు తీసుకోవడం కొంచెం బాధగా ఉందని పలువురు రైతులు వ్యాఖ్యానిస్తున్నారు.


Similar News