Minister Lokesh:ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం.. రేపటి నుంచే ప్రారంభం!

ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం(AP Government) రాష్ట్రాభివృద్ధే(AP Government) లక్ష్యంగా అడుగులు వేస్తోంది.

Update: 2025-01-03 14:59 GMT

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం(AP Government) రాష్ట్రాభివృద్ధే(AP Government) లక్ష్యంగా అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఇంటర్మీడియట్ (Intermediate) విద్యను బలోపేతం చేసేందుకు ఏపీ విద్యా శాఖ మంత్రి(Education Minister) లోకేష్(Minister Nara Lokesh) పలు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఈ తరుణంలో రాష్ట్ర వ్యాప్తంగా 475 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఇంటర్మీడియట్ విద్యార్థులకు ‘‘డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం’’ అమలు చేయాలని మంత్రి లోకేష్ నిర్ణయించారు.

ఈ నేపథ్యంలో రేపు (శనివారం) విజయవాడ(Vijayawada) పాయకాపురంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని(Mid-day meal scheme) మంత్రి నారా లోకేష్ లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు(Ministers), ఎమ్మెల్యేలు(MLA) పాల్గొంటారు. వివిధ ప్రభుత్వ జూనియర్ కళాశాలల(Govt Junior College) విద్యార్థులతో మంత్రి లోకేష్ వర్చువల్‌గా మాట్లాడనున్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేస్తారు.

Tags:    

Similar News