పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రధాన అనుచరుడు కిశోర్ అరెస్ట్
వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రధాన అనుచరుడు తురగా కిశోర్ ను పోలీసులు అరెస్టు చేశారు.
దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ మాజీ ఎమ్మెల్యే(Former YCP MLA) పిన్నెల్లి రామకృష్ణారెడ్డి(Pinnelli Ramakrishna Reddy) ప్రధాన అనుచరుడు(main followe) తురగా కిశోర్(Kishor) ను పోలీసులు అరెస్టు(arrest) చేశారు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో మాచర్లలో టీడీపీ నేత బోండా ఉమ, బుద్ధా వెంకన్న, ఆయన కారుపై వైసీపీ శ్రేణులు దాడి చేశారు. ఈ ఘటనలో ప్రధాన నిందితుడు అయిన కిశోర్ ను ఈ రోజు హైదరాబాద్‌లో ఏపీ పోలీసులు అరెస్టు చేశారు. అలాగే అతనిపై వైసీపీ ప్రభుత్వ హయాంలో పలు అక్రమాలకు, దౌర్జన్యాలకు పాల్పడినట్టు ఆరోపణలు ఉన్నాయి. అయితే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. దీంతో కిశోర్ వెంటనే అజ్ఞాతంలోకి వెళ్లాడు. అప్పటి నుంచి అతని కోసం పోలీసులు గాలిస్తూనే ఉన్నారు.