ప్రధాని మోడీ ఏపీ పర్యటనను విజయవంతం చేయాలి.. అధికారులతో మంత్రి నారా లోకేష్

భారత ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల 8న ఏపీలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా విశాఖ కలెక్టరేట్‌లో మంత్రులు, ఉన్నతాధికారులు, కూటమి ప్రజాప్రతినిధులతో మంత్రి నారా లోకేష్ సమీక్షా సమావేశం నిర్వహించారు.

Update: 2025-01-05 13:00 GMT

దిశ, వెబ్ డెస్క్: భారత ప్రధాని నరేంద్ర మోడీ(Prime Minister Narendra Modi) ఈ నెల 8న ఏపీలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా విశాఖ కలెక్టరేట్‌(Visakha Collectorate)లో మంత్రులు, ఉన్నతాధికారులు, కూటమి ప్రజాప్రతినిధులతో మంత్రి నారా లోకేష్(Minister Nara Lokesh) సమీక్షా సమావేశం(Review meeting) నిర్వహించారు. ఈ సందర్భంగా.. అందరూ కలిసికట్టుగా పనిచేసి జనవరి 8న విశాఖలో జరగనున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏపీ పర్యటన(Narendra Modi's visit to AP)ను విజయవంతం చేయాలని కోరినట్లు మంత్ని ట్వీట్ చేశారు. అందులో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి సారిగా ప్రధాని ఏపీకి వస్తున్నారు, ఇదొక చారిత్రాత్మక పర్యటన కాబోతుంది. ప్రధాని పర్యటనను విజయవంతం చెయ్యడానికి అన్ని ఏర్పాట్లను సమీక్షించాను, పలు సూచనలు చేశాను. అనంతరం సభాస్థలిని పరిశీలించి జరుగుతున్న ఏర్పాట్లను పర్యవేక్షించాను అని రాసుకొచ్చారు.

కాగా ఈ నెల 8న ప్రధాని మోడీ "గ్రీన్ హైడ్రోజన్ హబ్‌(Green Hydrogen Hub)"కు శంకుస్థాపన చేయనున్నారు. అలాగే అనకాపల్లిలోని పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం, రోడ్ షో(Road show), తో పాటు భారీ బహిరంగ సభ(Public meeting)లో ప్రధాని పాల్గొని మాట్లాడనున్నారు. ఎన్డీయే కూటమి(NDA alliance)లో రాష్ట్ర బాగా స్వామ్యం అధికంగా ఉండటంతో.. ఈ పర్యటనలో ప్రధాని మోడీ రాష్ట్రానికి మరిన్ని కేటాయింపులు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రధాని మోడీ పర్యటనకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తుండగా.. ఇప్పటికే కేంద్ర బలగాలు ప్రధాని పర్యటించే ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకున్నాయి.


Similar News