Chinta Mohan : ఎస్సీ వర్గీకరణపై కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ సంచలన వ్యాఖ్యలు
ఎస్సీ వర్గీకరణ (SC Classification), కాళేశ్వరం(Kaleshwaram) , పోలవరం(Polavaram), ఈవీఎం(EVM)లు, బ్యాంకు రుణా(Bank Loans)లపై సీనియర్ కాంగ్రెస్ నాయకులు, కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ సంచలన వ్యాఖ్యలు(Sensational Comments)చేశారు.
దిశ, వెబ్ డెస్క్: ఎస్సీ వర్గీకరణ (SC Classification), కాళేశ్వరం(Kaleshwaram) , పోలవరం(Polavaram), ఈవీఎం(EVM)లు, బ్యాంకు రుణా(Bank Loans)లపై సీనియర్ కాంగ్రెస్ నాయకులు, కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ సంచలన వ్యాఖ్యలు(Sensational Comments)చేశారు. రాజమండ్రిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎస్సీల వర్గీకరణపైన సుప్రీం కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ఒక ఫ్రాడ్ అని తీవ్ర విమర్శలు చేశారు. భారత రాజ్యాంగ విరుద్ధంగా, 7 గురు జడ్జీలు తీర్పు ఇచ్చారని.. అసలు ఆ జడ్జీలకు అంటరానితనమంటే తెలీదని..35 మంది జడ్జీల్లో ఒక్కరు కూడా ఎస్సీ కాలనీల్లో తిరగలేదని ఆరోపించారు. సుప్రీం కోర్టు 7 గురు జడ్జీలు ఇచ్చిన జడ్జీమెంట్ కాపీని పక్కనేవున్న తమిళనాడు సీఎం స్టాలిన్ చదివి బుట్టలో పడేశారని... కేరళ ముఖ్యమంత్రి విజయన్ జడ్జిమెంట్ కాపీని ఇసిరి పారేశారన్నారు. మన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు వర్గీకరణ పై కమిటీ వేశాడని, ఆయనెవరంటే యూపీ నుంచి 1987లో ఐఏఎస్ పాసై వచ్చారని.. అతనికి అంటరానితనమంటే తెలీదని, అతని సొంత రాష్ట్రం యూపీలోనే సుప్రీం కోర్టు జడ్జిమెంట్ కాపీ గురించి పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఏపీలో చంద్రబాబు నాయుడు ఎస్సీలను విభజించి పాలించాలని అనుకుంటున్నాడని,
రాష్ట్రంలో 13 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలున్నాయని.. దాంట్లోని రెండొందలో, మూడొందలో సీట్ల రిజర్వేషన్ కోసం క్లాసిఫికేషన్ అవసరమా? అని చింతామోహన్ ప్రశ్నించారు. 55 రోజులు చంద్రబాబు నాయుడును జైల్లో వేస్తే దిక్కు లేదని..ఆ రోజు రాజమండ్రికి నేనొచ్చి ఖండించి పోయానని.. జైలు నుంచి బయటకొచ్చి, నువ్వు చేయాల్సింది ఇదేనా అని మండిపడ్డారు. ఎస్సీల సెన్సెస్ ఏపీలో తీశారని, సెన్సెస్ తీసే అధికారం రిజిస్టార్ ఆఫ్ జనరల్ ఇండియాకే ఉంటుందన్నారు. కారంచేడులో తెలుగుదేశం పార్టీ వాళ్ళు దళితుల రొమ్ములను కోశారు. ఆ విషయం మేమింకా మర్చిపోలేదన్నారు. దళితుల జోలికొస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏమైపోతుందో!!? నాకు తెలీదని..జాగ్రత్త అని చంద్రబాబు నాయుడును హెచ్చరించారు.
తాను కాళేశ్వరం ప్రాజెక్టుపైన హైదరాబాద్ వెళ్ళి ఆరా తీస్తే ఒకాయన లక్షా ఇరవై వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసినా.. ఒక ఎకరాకు కూడా సాగునీరు రాలేదని పరోక్షంగా కేసీఆర్ ను విమర్శించారు. ఎవరెవరు ఎంత తిన్నారని తాను కలిసిన వ్యక్తిని అడిగితే అతను పొలిటిషియన్లు 30 వేల కోట్లు తిన్నారని.. 20 వేల కోట్లు ఇంజనీర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు తీసుకున్నారని..20 వేల కోట్ల రూపాయలు కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం చేస్తున్నవారు తీసుకున్నారని నాతో చెప్పాడని కీలక ఆరోపణలు చేశారు. కాళేశ్వరం అక్రమాలపై జస్టిస్ పినాకిని చంద్ర బోస్ అనే వ్యక్తిని కమిషన్ వేశారని...చిన్న చిన్న దానిపై సీబీఐ వేస్తారని..మరి కాళేశ్వరం పైన సీబీఐ ఎంక్వయిరీ ఎందుకు వెయ్యకూడదని ప్రశ్నించారు.
మరో ఇరిగేషన్ ప్రాజెక్ట్ పోలవరం అంచనాలు ప్రతిరోజూ పెంచుకుంటూ పోతున్నారని... ఇప్పటి వరకు 50 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశారని... 25 వేల కోట్లు రూపాయలు ఎడమ కాలువ, కుడి కాలువ కు ఖర్చయిందంటా అని... ఇంకో 25 వేల కోట్ల రూపాయలు బిల్లులు రావాల్సి ఉందని.. పోలవరంపై పొలిటిషియన్లు డబ్బు సంపాదిస్తున్నారని విమర్శించారు. జలహారం ప్రాజెక్టుపై 80 వేల కోట్లు రూపాయలు అప్పు ఢిల్లీలో అడిగారని... ఇచ్చేదానికి వాళ్లు తయారుగా ఉన్నారని... గోదావరి నీళ్లు కృష్ణకి, కృష్ణా నుంచి పెన్నాకి నీళ్లు తరలిస్తారంటారని విమర్శించారు. పోలవరంపై సీబీఐ ఎంక్వయిరీ వేసే దమ్ముందా?? అని చంద్రబాబు నాయుడును ప్రశ్నిస్తున్నానన్నారు.
ఎన్నికల్లో ఈఎంలను ట్యాంపరింగ్ చేసి, ప్రజాస్వామ్యాన్ని బీజేపీ ఖూనీ చేస్తుందని.. ఈవీఎంలను కాంగ్రెస్ తెచ్చినప్పటికి బీజేపీ మాదిరిగా అక్రమాలు చేయలేదన్నారు. బ్యాంకులు లక్షల కోట్లు అప్పులు ఇస్తున్న దేశంలోని బ్యాంకులు దేశ జనాభాలో 25 శాతం ఉన్న ఎస్సీ, ఎస్టీలకు అప్పుల్లో ఒక్క శాతం కూడా ఇవ్వడం లేదని విమర్శించారు. ఎస్సీ వర్గీకరణ కోరుకుంటున్న వాళ్లు యూపీలో, తమిళనాడులో, కేరళలో ఎందుకు కోరడం లేదని ప్రశ్నించారు. బ్యాంకులు ఇస్తున్న అప్పుల్లో ఎస్సీలకు జరుగుతున్న అన్యాయం గురించి ఎందుకడగడంలేదన్నారు. జనసేన పార్టీలో కాపు, కమ్మ వాళ్లకే మంత్రి పదవులు ఇచ్చారని, సామాజిక న్యాయం పాటించలేదని, దీనిపై మీ అభిప్రాయం ఏంటని అడగ్గా, ఢిల్లీలోఒక గడ్డమాయన, ఒక పొట్టాయనకి మాత్రమే పవర్ ఉందని, మిగిలిన మంత్రులెవరికీ పవరేలేదని చింతామోహన్ మీడియా ప్రతినిధుల ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.