Nara Lokesh : ఉత్తరాంధ్రకు వైసీపీ ఐదేళ్లలో చేసిందేమీ లేదు : నారా లోకేష్

ఉత్తరాంధ్ర(Northen AP) కోసం ఐదేళ్లలో వైసీపీ(YCP) చేసిందేమీ లేదని, కనీసం రైల్వే జోన్ కు భూమి కూడా ఇవ్వలేదని, ఒక్క ఐటీ కంపెనీ తీసుకురాలేదని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్(Nara Lokesh) మండిపడ్డారు.

Update: 2025-01-05 13:39 GMT

దిశ, వెబ్ డెస్క్ : ఉత్తరాంధ్ర(Northen AP) కోసం ఐదేళ్లలో వైసీపీ(YCP) చేసిందేమీ లేదని, కనీసం రైల్వే జోన్ కు భూమి కూడా ఇవ్వలేదని, ఒక్క ఐటీ కంపెనీ తీసుకురాలేదని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్(Nara Lokesh) మండిపడ్డారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో విశాఖ కలెక్టరేట్ లో సమీక్ష అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. "8వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ(PM Narendra Modi) ఏపీకి వస్తున్నారు. సుమారు కిలోమీటర్ వరకు రోడ్ షో తర్వాత అనేక అభివృద్ధి కార్యక్రమాలకు మోడీ శంకుస్థాపన చేస్తారు. నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్క్ కు శంకుస్థాపన చేస్తున్నాం. ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ.. దాదాపు రూ.70వేల కోట్ల పెట్టుబడితో ఉత్తరాంధ్రలో ప్లాంట్ రాబోతోంది.

నెల్లూరుకు వచ్చేసరికి చెన్నై-విశాఖ ఇండస్ట్రియలన్ కారిడార్లో క్రిస్ సిటీ కృష్ణపట్నంలో కేంద్ర ప్రభుత్వం నోడ్ శాంక్షన్ చేసింది. నిధులు కూడా కేటాయించారు. ఆ నోడ్ వల్ల పెట్టుబడులు, లక్షలాది మందికి ఉద్యోగాలు వస్తాయి. ఈ నోడ్ కు కూడా శంకుస్థాపన చేస్తారు. పలు జాతీయ రహదారులను నిర్మించడం జరుగుతుంది. సుమారు రూ.5 వేల కోట్లు ఖర్చుపెట్టి కొత్త ప్రాజెక్టులు చేపట్టనున్నాం. ఇప్పటికే పూర్తైన ప్రాజెక్టులను ప్రధాని ప్రారంభించనున్నారు. రైల్వే జోన్ అందరి కల. జోనల్ హెడ్ క్వార్టర్ విశాఖలో ఉండాలని ఉత్తరాంధ్ర ప్రజలు కోరుకుంటున్నారు. గత ప్రభుత్వం కనీసం భూమి కూడా కేటాయించలేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే భూమి కేటాయించింది. రైల్వే హెడ్ క్వార్టర్ కు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. ఇవేకాకుండా పలు రైల్వేకు సంబంధించిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు కూడా శంకుస్థాపన చేయనున్నారు." నారా లోకేష్ మీడియాకు తెలిపారు. 

Tags:    

Similar News