POCSO Case: వైసీపీ మాజీ ఎమ్మెల్యేకు ఊహించని షాక్.. పోక్సో కేసు నమోదు
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో సీన్ ఒక్కసారిగా మారిపోయింది.
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో సీన్ ఒక్కసారిగా మారిపోయింది. ఐదేళ్లు అధికారాన్ని అడ్డుపెట్టుకుని వైసీపీ (YCP) నాయకులు భూకబ్జాలు, హత్యలు, అత్యాచారలకు పాల్పడ్డారు. వారందరిపై లెక్కలు తేల్చేందుకు చంద్రబాబు (Chandrababu) సర్కార్ నడుంబిగించింది. ఇప్పటికే సోషల్ మీడియా (Social Media) వేదికగా టీడీపీ (TDP), జనసేన (Janasena) నాయకులపై అనుచిత పోస్టులు పెట్టిన వైసీపీ (YCP) ముఖ్య నాయకులు, సోషల్ మీడియా (Social Media) ఇంచార్జీలకు పోలీసులు ఇటీవలే నోటీసులు జారీ చేశారు. ‘వ్యూహం’ (Vyuham) సినిమా ప్రమోషన్‌లో భాగంగా చంద్రబాబు (Chandrababu), లోకేశ్ (Lokesh), పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)పై అనుచిత పోస్టులు పెట్టినందుకు గాను దర్శకుడు రాంగోపాల్ వర్మ (Ramgopal Varma)కు ప్రకాశం పోలీసులు కోర్టుకు హాజరు కావలంటూ నోటీసులు జారీ చేశారు.
కానీ, ఆయన విచారణకు హాజరుకాకపోవడంతో ఆర్జీవీ (RGV)ని అరెస్ట్ చేసేందుకు పోలీసులు వేట మొదలు పెట్టారు. ఈ క్రమంలోనే వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి (Chevireddy Bhaskar Reddy)కి బిగ్ షాక్ తగిలింది.. తాజాగా ఆయనపై పోలీసులు పోక్సో కేసు POCSO Case నమోదు చేశారు. తిరుపతి జిల్లా (Tirupati District) యర్రావారిపాలెం (Yerravaripalem) మండలంలో ఓ బాలికపై అత్యాచారం జరిగినట్లు వైసీపీ నేతి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి (Chevireddy Bhaskar Reddy) తప్పుడు ప్రచారం చేశారు. దీంతో తమ కూతురి గురించి అసత్య ప్రచారం చేశారంటూ చెవిరెడ్డితో పాటు మరికొందరిపై బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు పోక్సో చట్టం (POCSO Act) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.