Women murder: తాడేపల్లిలో మహిళ దారుణహత్య
గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కొలనుకొండ వద్ధ ఓ మహిళ దారుణ హత్యకు గురైంది.

పామర్రుకు చెందిన తిరుపతమ్మగా గుర్తింపు
దిశ, ఏపీ బ్యూరో : గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కొలనుకొండ (kolanukonda) వద్ధ ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. నిన్న రాత్రి కొలనుకొండ వద్ద నిర్మానుష్య ప్రాంతంలో మృతదేహం కనిపించింది. స్థానికుల సమాచారంతో పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతురాలు పామర్రుకు చెందిన సజ్జా లక్ష్మీ తిరుపతమ్మగా గుర్తించారు. ఆమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. భర్త మృతితో కుటుంబ పోషణకు ఆమె క్యాటరింగ్ పనులకు వెళ్తుంటారు. ఈ క్రమంలో నిన్న ఉదయం విజయవాడలో క్యాటరింగ్ పనికి వెళుతున్నట్లు చెప్పి ఇంటి నుంచి బయలుదేరింది. కొలనుకొండ ముళ్లపొదల్లో ఆగంతకుల చేతిలో దారుణ హత్యకు గురైన లక్ష్మీ తిరుపతమ్మ మృతదేహం నిన్న రాత్రి గుర్తించారు. అనుమానితులను అదుపులోకి తీసుకుని తాడేపల్లి పోలీసులు విచారిస్తున్నారు