Minister Nimmala Ramanaidu: నిరుపేదలకు వైద్యం అందేలా బడ్జెట్‌లో నిధుల కేటాయింపు
రాష్ట్రం(Andhra Pradesh)లోని నిరుపేదలకు వైద్యం అందేలా బడ్జెట్‌లో రూ.19,264 కోట్లు నిధులు కేటాయించమని మంత్రి నిమ్మల రామానాయుడు(Minister Nimmala Ramanaidu) వెల్లడించారు.

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రం(Andhra Pradesh)లోని నిరుపేదలకు వైద్యం అందేలా బడ్జెట్‌లో రూ.19,264 కోట్లు నిధులు కేటాయించమని మంత్రి నిమ్మల రామానాయుడు(Minister Nimmala Ramanaidu) వెల్లడించారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలో మంత్రి నిమ్మల పర్యటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పాలకొల్లులో సీఎం సహాయనిధి కింద 28 మందికి రూ.12.60లక్షల చెక్కులను మంత్రి నిమ్మల అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పేదవాడికి కార్పొరేట్ వైద్యం అందేలా రూ.25 లక్షల ఆరోగ్య భీమా పథకం తీసుకొచ్చామని వివరించారు. పేద ప్రజల ఆరోగ్యం కోసం ఇంటింటికి క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేయనున్నామని నిమ్మల చెప్పారు. కిడ్నీ రోగుల పాలిట వరంగా డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని అన్నారు. ఎన్టీఆర్ వైద్య సేవలకు బకాయిల్లో రూ.1300 కోట్లు చెల్లించామని మంత్రి నిమ్మల వెల్లడించారు.
ఈ క్రమంలో గత ప్రభుత్వం పై మంత్రి నిమ్మల రామానాయుడు మరోసారి విమర్శలు గుప్పించారు. జల్ జీవన్ మిషన్ పథకం అమలులో గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర వాటా ఎగ్గొట్టి ఆ నిధులను పక్కదారి పట్టించారని ఆరోపించారు. మూడు గ్రామాల్లో జల్ జీవన్ మిషన్ పథకం(Jal Jeevan Mission Scheme) కింద రూ.2 కోట్ల 31 లక్షలతో మంచినీటి పథకం పనులకు శంకుస్థాపన చేశారు. రాష్ట్రంలో 95.44 లక్షల కుటుంబాలకు కుళాయిల ద్వారా స్వచ్ఛ తాగునీరు అందించాలన్నదే కూటమి ప్రభుత్వ(AP Government) లక్ష్యమని ఆయన తెలిపారు.