కరోనా పేషెంట్ల ఆక్సిజన్ సిలిండర్లు లూటీ..!
భోపాల్: దేశంలో ఆక్సిజన్ సిలిండర్ల కొరత ఏర్పడిందనడానికి ఈ సంఘటనే చక్కని నిదర్శనం. మధ్యప్రదేశ్‌లోని దామో జిల్లా ఆసుపత్రిలో ఆక్సిజన్ సిలిండర్లను మంగళవారం అర్ధరాత్రి కొందరు వ్యక్తులు దోచుకుపోయారు. లోడు దిగడమే ఆలస్యం ఒక్కసారిగా దాడి చేసి సిలిండర్లను ఎత్తుకెళ్లారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన అధికారులు నిందితులను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. కరోనా విజృంభణ కొనసాగుతున్న నేపథ్యంలో దేశంలో మెడికల్ ఆక్సిజన్‌కు భారీగా డిమాండ్ పెరిగింది. ఈ క్రమంలోనే మధ్యప్రదేశ్ ఘటన చోటు చేసుకుందని […]
భోపాల్: దేశంలో ఆక్సిజన్ సిలిండర్ల కొరత ఏర్పడిందనడానికి ఈ సంఘటనే చక్కని నిదర్శనం. మధ్యప్రదేశ్‌లోని దామో జిల్లా ఆసుపత్రిలో ఆక్సిజన్ సిలిండర్లను మంగళవారం అర్ధరాత్రి కొందరు వ్యక్తులు దోచుకుపోయారు. లోడు దిగడమే ఆలస్యం ఒక్కసారిగా దాడి చేసి సిలిండర్లను ఎత్తుకెళ్లారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన అధికారులు నిందితులను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. కరోనా విజృంభణ కొనసాగుతున్న నేపథ్యంలో దేశంలో మెడికల్ ఆక్సిజన్‌కు భారీగా డిమాండ్ పెరిగింది. ఈ క్రమంలోనే మధ్యప్రదేశ్ ఘటన చోటు చేసుకుందని కలెక్టర్ తరుణ్ రతి అనుమానం వ్యక్తం చేశారు. సోమవారం కూడా ఇక్కడ ఇలాంటి ఘటనే చోటు చేసుకుందని తెలిపారు. ఈ వరుస ఘటనలతో అప్రమత్తమైన అధికారులు.. మరోసారి రిపీట్ కాకుండా ఆసుపత్రి ప్రాంగణంలో పోలీసులను నియమించారు.