ఢిల్లీ అల్లర్లపై కేంద్రానిది ప్రేక్షక పాత్ర
ఢిల్లీ అల్లర్లపై పార్లమెంట్‌లో వాడీవేడిగా చర్చ జరుగుతోంది. చర్చలో భాగంగా అల్లర్లపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ రాజధాని నడిబొడ్డున జరిగిన అల్లర్లను కంట్రోల్ చేయడంలో ప్రధానిమోడీ, హోంమంత్రి అమిత్ షా ఘోరంగా విఫలమయ్యారని, వీరు కేవలం ప్రేక్షక పాత్రకే పరిమితమయ్యారన్నారు. ఢిల్లీ పోలీసులు లంచాలు తీసుకుని మరణహోమానికి కారణమైన వారిని వదిలేసి కేవలం ముస్లిం యువకులను అరెస్టు చేస్తున్నారని ఆరోపించారు. అంతేకాకుండా బీజేపీ ప్రభుత్వం హిందువులను ఉగ్రవాదులుగా మారుస్తుందని […]
ఢిల్లీ అల్లర్లపై పార్లమెంట్‌లో వాడీవేడిగా చర్చ జరుగుతోంది. చర్చలో భాగంగా అల్లర్లపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ రాజధాని నడిబొడ్డున జరిగిన అల్లర్లను కంట్రోల్ చేయడంలో ప్రధానిమోడీ, హోంమంత్రి అమిత్ షా ఘోరంగా విఫలమయ్యారని, వీరు కేవలం ప్రేక్షక పాత్రకే పరిమితమయ్యారన్నారు. ఢిల్లీ పోలీసులు లంచాలు తీసుకుని మరణహోమానికి కారణమైన వారిని వదిలేసి కేవలం ముస్లిం యువకులను అరెస్టు చేస్తున్నారని ఆరోపించారు. అంతేకాకుండా బీజేపీ ప్రభుత్వం హిందువులను ఉగ్రవాదులుగా మారుస్తుందని ధ్వజమెత్తారు.కేంద్ర ప్రభుత్వం తీరు రాజ్యాంగ విధానాలకు తూట్లు పొడిచేలా ఉందన్నారు.ఢిల్లీ అల్లర్ల ఘటనలకు సంబంధించిన చిత్రాలను ఐసిస్ తన వెబ్‌సైట్‌లో పోస్ట్ చేసి ఇండియన్ ముస్లింలను ఉగ్రవాదానికి పురిగొల్పుతోందని వివరించారు. దేశంలో ఈలాంటి ఘటనలు ఎన్నిజరిగినా భారతీయ ముస్లింలు దేశకోసం ప్రాణాలు అర్పించడానికి సిద్ధంగా ఉండాలని, అంతేకాని ఉగ్రవాదం వైపు వెళ్లరాదని ఓవైసీ పిలుపునిచ్చారు.
Tags: parliament sessions, delhi riots discussion, owasi ask modi govt, hindu terrorism