Netanyahu: బందీల విడుదలకు చర్యలు తీసుకుంటున్నాం.. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు

గాజాలో బందీలను విడుదల చేసేందుకు హమాస్‌తో జరుపుతున్న చర్చల్లో పురోగతి సాధించామని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు చెప్పారు.

Update: 2024-12-24 13:02 GMT

దిశ, నేషనల్ బ్యూరో: గాజా (Gaza)లో ఉన్న బందీలను విడుదల చేసేందుకు హమాస్‌తో జరుపుతున్న చర్చల్లో కొంత పురోగతి సాధించామని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు (Benzamin nethanyahu) చెప్పారు. దానికి సంబంధించి ఏం చేస్తు్న్నామనే విషయాలను బయటపెట్టలేమని తెలిపారు. బందీలను వెనక్కి రప్పించేందుకు మాత్రం చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. ఇజ్రాయెల్ పార్లమెంటులో ఆయన మంగళవారం ప్రసంగించారు. ‘ఇటీవల ఖతార్ (Kathar), ఈజిప్ట్ (Egypt) అమెరికా(America) మధ్యవర్తిత్వంతో ఇజ్రాయెల్, హమాస్‌ల మధ్య పరోక్ష చర్చలు దోహాలో జరిగాయి. బందీల విడుదలకు ప్రయత్నిస్తున్నాం. మేం చేస్తున్న ప్రతీ చర్యను బహిర్గతం చేయలేము. వారిని తిరిగి తీసుకురావడానికి కృషి చేస్తున్నాం. ఈ విషయంలో కొంత పురోగతి సాధించాం. బందీల కుటుంబాలు నిరుత్సాహపడొద్దు. మీ గురించే ఆలోచిస్తున్నాం’ అని వ్యాఖ్యానించారు. బందీలను తిరిగి తీసుకొచ్చే వరకు విశ్రమించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.

కాగా, గతేడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై ఉగ్రవాద సంస్థ హమాస్ భారీ దాడిని ప్రారంభించింది. ఇందులో 1200 మందికి పైగా మరణించగా.. 250 మంది ఇజ్రాయెలీలను బందీలుగా చేసుకున్నారు. ఇందులో ఇంకా 100 మంది హమాస్ చెరలో ఉన్నారు. ఈ దాడికి ప్రతిస్పందనగా, ఇజ్రాయెల్ గాజాపై దాడులు చేపట్టాగా ఇప్పటివరకు 45 వేల మందికి పైగా పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు. హమాస్ అగ్రనాయకత్వాన్ని ఇజ్రాయెల్ అంతమొందించినా ఇజ్రాయెల్ బందీలు మాత్రం ఇప్పటికీ గాజాలోనే ఉన్నారు. అయితే నెతన్యాహు వారి విడుదలకు ప్రయత్నించడం లేదని బందీల కుటుంబాలను పదే పదే ఆరోపిస్తున్నాయి. ఈ క్రమంలోనే నెతన్యాహు తాజాగా క్లారిటీ ఇచ్చారు.

Tags:    

Similar News