రేప్ బాధితులకు వాటిని అందించాల్సిందే.. ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు

రేప్, లైంగిక హింస, యాసిడ్ దాడులకు గురైన బాధితులకు ఉచిత వైద్యాన్ని అందించాల్సిందే అని ఢిల్లీ కోర్టు తీర్పు వెల్లడించింది.

Update: 2024-12-24 12:37 GMT

దిశ, నేషనల్ బ్యూరో : రేప్, లైంగిక హింస, యాసిడ్ దాడులకు గురైన బాధితులకు ఉచిత వైద్యాన్ని అందించాల్సిందే అని ఢిల్లీ కోర్టు తీర్పు వెల్లడించింది. 16 ఏళ్ల బాలికపై ఆమె తండ్రి అత్యాచారం చేసిన కేసులో న్యాయమూర్తులు ప్రతిభాసింగ్, అమిత్ శర్మలతో కూడిన ధర్మాసనం మంగళవారం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. రేప్, పోక్సో బాధితులకు ఫ్రీ వైద్యం అందించాలని కోర్టు ఆదేశించింది. లైంగిక వేధింపుల బాధితులకు చికిత్స నిరాకరించడం నేరమని కోర్టు తెలిపింది. ఇందుకు వైద్యులు, సిబ్బందికి జరిమానా విధించవచ్చని స్పష్టం చేసింది. బాధితులకు అన్ని రకాల పరీక్షలు, డయాగ్నొస్టిక్స్, దీర్ఘకాలిక వైద్య సేవలు ఉచితంగా అందించాలని కోర్టు తెలిపింది. దీంతో పాటు బాధితులకు శారీరక, మానసిక కౌన్సెలింగ్ ఉచితంగా అందించాలని ఆదేశాలు జారీ చేసింది.

ఆసుపత్రులకు గైడ్‌లైన్స్ జారీ..

ఢిల్లీలోని ఆసుపత్రులకు హైకోర్టు ఈ మేరకు కొన్ని గైడ్ లైన్స్ జారీ చేసింది. ‘రేప్, యాసిడ్ దాడుల బాధితులకు ఫ్రీ ఔట్ పేషెంట్, ఇన్ పేషెంట్ సేవలు’ అందుబాటులో ఉన్నట్లు ఆసుపత్రి ఎదుట బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించింది. హెచ్ఐవీకి సైతం ట్రీట్‌మెంట్ అందించాలని కోర్టు స్పష్టం చేసింది. బాధితులకు ప్రెగ్నెసీ టెస్ట్‌లు చేయాలని పేర్కొంది. అత్యవసర కేసుల్లో బాధితురాలి రుజువు కోసం ఐడీ అడిగి ఇబ్బంది పెట్టొద్దని సూచించింది.

Tags:    

Similar News