మీలో స్కిల్స్ ఉన్నాయా.. లేకపోతే త్వరపడండి?
దిశ, వెబ్‌డెస్క్ : మంచి ఉద్యోగం.. ఆశించిన జీతం.. మెరుగైన జీవితం నేటి యువతరం ముందున్న ఏకైక లక్ష్యం. శక్తి సామర్థ్యాలు ఉన్నా.. తగిన నైపుణ్యం లేకపోవడం వల్ల 2030 సంవత్సరానికి చదువుకు తగ్గట్లు ఉద్యోగాలు పొందడంలో దక్షిణాసియా యువత వెనకబడిపోతున్నారని ఐక్యరాజ్య సమితి చిల్డ్రన్స్ ఫండ్ (యునిసెఫ్) ఎగ్జిక్యూటీవ్ డైరక్టర్ హెన్రిట్టా హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా దక్షిణాది యువత 2030 నాటికి ప్రతీరోజూ లక్షమందికి పైగా తమ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకొని ఉద్యోగాల కోసం […]
దిశ, వెబ్‌డెస్క్ : మంచి ఉద్యోగం.. ఆశించిన జీతం.. మెరుగైన జీవితం నేటి యువతరం ముందున్న ఏకైక లక్ష్యం. శక్తి సామర్థ్యాలు ఉన్నా.. తగిన నైపుణ్యం లేకపోవడం వల్ల 2030 సంవత్సరానికి చదువుకు తగ్గట్లు ఉద్యోగాలు పొందడంలో దక్షిణాసియా యువత వెనకబడిపోతున్నారని ఐక్యరాజ్య సమితి చిల్డ్రన్స్ ఫండ్ (యునిసెఫ్) ఎగ్జిక్యూటీవ్ డైరక్టర్ హెన్రిట్టా హెచ్చరికలు జారీ చేశారు.
ముఖ్యంగా దక్షిణాది యువత 2030 నాటికి ప్రతీరోజూ లక్షమందికి పైగా తమ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకొని ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తారని, వారిలో సగం మందికి పైగా ఉద్యోగాల్ని సంపాదించే సరైన స్కిల్స్ లేకపోవడం ఆందోళన కలిగిస్తుంది. దానికి తోడు పరిమితంగా ఉద్యోగ అవకాశాలు రావడంతో యువత తీవ్రమైన ఆందోళనకు గురి కావాల్సి వస్తుందని యునిసెఫ్ డైరక్టర్ తెలిపారు. యువత నైపుణ్యాలు దేశ ఆర్థిక స్థితిగతులపై ఆధారపడుతాయి.” అనుకున్న రంగంలో జాబ్ పొందాలంటే స్కిల్స్ నేర్చుకోవాలి. అలా చేస్తేనే నిరుద్యోగం, పేదరికం నుంచి బయటపడవచ్చు. లేదంటే దేశం ఆర్ధికంగా నష్టపోతుంది. యువతలో నిరాశ పెరిగిపోతుంది. నైపుణ్యం ఉన్నవారు ఇతర దేశాల్లో స్థిరపడేందుకు మొగ్గుచూపుతారని అన్నారు.
సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఇ) ప్రకారం.. నిరుద్యోగ రేటు 8.45% ఉంది. ఆటోమొబైల్ రంగంలో ఒడిదుడుకులతో పాటు టెలికాం మరియు ఐటి రంగంలో ప్రాజెక్ట్‌లు లేకపోవడం నిరుద్యోగం పెరిగిపోవడం ఓ కారణమనే చెప్పుకోవాలి.
మూడు ప్రధాన టెక్ దిగ్గజాలు cap gemini, infosys, cognizent లాంటి సంస్థలు 500 సీనియర్ స్థాయి ఉద్యోగాలను తగ్గిస్తున్నాయి. అంతేకాకుండా, టెలికాం రంగంలో బకాయిలు చెల్లించనందున BSNLకు చెందిన లక్షమంది మంది ఉద్యోగుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. ఈ సందర్భంగా యువతకు మంచి భవిష్యత్ అందించేలా చొరవ తీసుకోవాలని యునిసెఫ్ డైరక్టర్ కేంద్రాన్ని కోరారు.
మంత్రి స్మృతి ఇరానీ మాట్లాడుతూ.. కేంద్రం 10 నుంచి 24ఏళ్ల మధ్య వయస్సు గల యువతలో నైపుణ్యం పెరిగేలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. యునిసెఫ్ మద్దతుతో రాబోయే పదేళ్ళలో 300 మిలియన్ల మంది యువకులను విద్య, నైపుణ్య శిక్షణ లేదా ఉపాధి అవకాశాల్ని కల్పించే ప్రణాళిక సిద్ధం చేసినట్లు వెల్లడించారు.