నాతో జాగ్రత్త : పార్టీలో కరోనా కలకలం.. 103మందికి వైరస్

దిశ,వెబ్‌డెస్క్: ప్రపంచ దేశాల్ని వణికిస్తున్న కరోనా వైరస్ అంటే ప్రజలు బయపడడం ఎప్పుడో మానేశారు. కరోనా వ్యాక్సిన్ వచ్చిందనో, లేదంటే ఆ కరోనా మనల్ని ఏం చేస్తుందనే ధీమాతో కనీస జాగ్రత్తలు తీసుకోవడం లేదు. అలా జాగ్రత్తలు తీసుకోవడం వల్లే ఇటీవల జరిగిన ఓ ప్రైవేట్ పార్టీలో  సుమారు 103 మందికి కరోనా సోకింది. బెంగళూరులోని బొమ్మనహళ్లి జోన్ ప్రాంతానికి చెందిన బిలేకహళ్లిలోని ఎస్ఎన్ఎన్ రాజ్ లేక్ వ్యూ అనే అపార్ట్ మెంట్ ఉంది. ఆ అపార్ట్ […]

Update: 2021-02-16 05:21 GMT

దిశ,వెబ్‌డెస్క్: ప్రపంచ దేశాల్ని వణికిస్తున్న కరోనా వైరస్ అంటే ప్రజలు బయపడడం ఎప్పుడో మానేశారు. కరోనా వ్యాక్సిన్ వచ్చిందనో, లేదంటే ఆ కరోనా మనల్ని ఏం చేస్తుందనే ధీమాతో కనీస జాగ్రత్తలు తీసుకోవడం లేదు. అలా జాగ్రత్తలు తీసుకోవడం వల్లే ఇటీవల జరిగిన ఓ ప్రైవేట్ పార్టీలో సుమారు 103 మందికి కరోనా సోకింది.

బెంగళూరులోని బొమ్మనహళ్లి జోన్ ప్రాంతానికి చెందిన బిలేకహళ్లిలోని ఎస్ఎన్ఎన్ రాజ్ లేక్ వ్యూ అనే అపార్ట్ మెంట్ ఉంది. ఆ అపార్ట్ మెంట్ లో మొత్తం 435 ఫ్లాట్లు ఉన్నాయి. 1500 మంది నివాసం ఉంటున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 6న ఎస్ఎన్ఎన్ రాజ్ లేక్ వ్యూ అపార్ట్ మెంట్ లో ప్రైవేట్ పార్టీ జరిగింది. ఈ పార్టీకి సుమారు 45 మంది అటెండ్ అయ్యారు. వీరితో పాటు కుక్, డ్రైవర్లు కూడా ఉన్నారు. అదే రోజు అపార్ట్‌మెంట్ లో 500 మంది ఓ ఈవెంట్ లో పాల్గొన్నట్లు బెంగళూరు మున్సిపాలిటీ అధికారులు తెలిపారు. ఆ పార్టీ జరిగిన కొద్దిరోజులకే అంటే ఫిబ్రవరి 10న పలువురు అస్వస్థతకు గురయ్యారు. దీంతో బాధితుల్ని ఆస్పత్రికి తరలించారు. బాధితులకు కరోనా టెస్ట్ లు చేయగా.. ఈ కరోనా టెస్టుల్లో 103 మందికి ఎలాంటి లక్షణాలు లేకున్నా కరోనా వైరస్ సోకినట్లు డాక్టర్లు గుర్తించారు.

ఈ సందర్భంగా బెంగళూరు మున్సిపల్ అధికారులు మాట్లాడుతూ 513 కుటుంబాలకు చెందిన 900మందికి కరోనా టెస్ట్‌లు చేసినట్లు తెలిపారు. ఆ అపార్ట్‌మెంట్ పై ఆంక్షలు విధించి కరోనా ప్రొటోకాల్ కు అనుగుణంగా వ్యవహరించేలా చర్యలు తీసుకున్నట్లు చెప్పారు.

Tags:    

Similar News