కేంద్రానికి ప్రతిపక్షాలు లేఖ…

న్యూఢిల్లీ: ప్రస్తుత కరోనా నేపథ్యంలో దేశంలో ఉచితంగా మాస్ వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహించాలని, సెంట్రల్ విస్టా ప్రాజెక్టును రద్దు చేయాలంటూ ప్రధాని మోడీకి దేశంలోని 12 ప్రతిపక్ష పార్టీలు బుధవారం లేఖ రాశాయి. కరోనాను మహా మానవ విషాదంగా పేర్కొంటూ లేఖలో ఆందోళన వ్యక్తం చేశాయి. దేశంలో కరోనా భయంకరంగా విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్రం వెంటనే చర్యలను చేపట్టాలని డిమాండ్ చేశారు. గతంలో కూడా తాము కరోనా కట్టడికి అనుసరించాల్సిన అత్యవసర చర్యల గురించి కేంద్రం దృష్టికి […]

Update: 2021-05-12 11:33 GMT

న్యూఢిల్లీ: ప్రస్తుత కరోనా నేపథ్యంలో దేశంలో ఉచితంగా మాస్ వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహించాలని, సెంట్రల్ విస్టా ప్రాజెక్టును రద్దు చేయాలంటూ ప్రధాని మోడీకి దేశంలోని 12 ప్రతిపక్ష పార్టీలు బుధవారం లేఖ రాశాయి. కరోనాను మహా మానవ విషాదంగా పేర్కొంటూ లేఖలో ఆందోళన వ్యక్తం చేశాయి. దేశంలో కరోనా భయంకరంగా విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్రం వెంటనే చర్యలను చేపట్టాలని డిమాండ్ చేశారు. గతంలో కూడా తాము కరోనా కట్టడికి అనుసరించాల్సిన అత్యవసర చర్యల గురించి కేంద్రం దృష్టికి తీసుకు వచ్చామని తెలిపాయి. కానీ వాటిని కేంద్రం పట్టించుకోకుండా తిరస్కరించిదని వెల్లడించాయి. అందువల్లే ఇప్పుడు మహా మానవ విషాదాన్ని ఎదుర్కోవాల్సి వస్తోందని కేంద్రంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. అయితే గతం గూర్చి ఆలోచిస్తు కూర్చోవడం వల్ల లాభం లేదనీ.. అందుకే ఇప్పుడు ముందు జరగాల్సిన పనుల గురించి చర్చించేందుకే లేఖ రాస్తున్నట్టు తెలిపాయి. కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలను మీ ముందు ఉంచుతున్నాం, వాటిపై దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని కోరాయి.

ప్రతిపక్షాలు చేసిన సూచనలు:

  • గ్లోబల్‌గా, దేశీయంగా అందుబాటులో ఉన్న అన్ని వనరుల నుంచి వ్యాక్సిన్ సేకరణ చేయాలి.
  • వెంటనే దేశంలో ఉచిత సామూహిక వ్యాక్సినేషన్ క్యాంపెయిన్ నిర్వహించాలి.
  • వ్యాక్సినేషన్ కోసం బడ్జెట్‌లో కేటాయించిన రూ.35వేల కోట్లను ఖర్చు చేయాలి.
  • సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్ (పార్లమెంటరీ కొత్త భవనం) నిర్మాణం నిలిపి వేసి ఆ డబ్బును వ్యాక్సిన్, ఆక్సిజన్ కోసం వినియోగించాలి.
  • అన్ అకౌంటెండ్ ప్రైవేట్ ట్రస్టుల ఖాతాల్లో, పీఎం కేర్స్ లో ఉన్న మొత్తం డబ్బును విడుదల చేసి వ్యాక్సిన్ కొనుగోలు, ఆక్సిజన్, వైద్య పరికరాలు సమకూర్చుకోవడానికి వినియోగించుకోవాలి.

నిరుద్యోగులకు నెలకు రూ. 6వేల భృతి ఇవ్వాలి

ఆహార ధాన్యాలను పేదలకు ఉచితంగా పంచిపెట్టాలి. రైతులు కొవిడ్ భారిన పడకుండా ఉండాలంటే సాగు చట్టాలను రద్దు చేయాలి. దీంతో రైతులు మళ్లీ వ్యవసాయం వైపు వెళతారు. ప్రజలకు ఆహారం కూడా దొరకుతుంది. దేశ శ్రేయస్సును దృష్టిని పెట్టుకుని తమ సలహాలను పాటించాలని లేఖలో కోరాయి.

Tags:    

Similar News