ఆన్ లైన్ పెళ్లి.. లైవ్ లో శుభాకాంక్షలు
దిశ,బోథ్: పెళ్లి అంటే బంధువుల కోలాహలం,స్నేహితుల జోకులు, ఒక పండగలా చేసుకునేవారు. కానీ ఈ మహమ్మారి వలన పెళ్లిల కల తప్పింది. ప్రభుత్వం పెళ్లికి 40 మందినే అనుమతి ఇవ్వడంతో ఎవరిని పెళ్లికి పిలవాలి, ఎవరిని పిలవకూడదో అర్థం కావడం లేదని పెళ్లి వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొందరు బుర్రకు పదను పెట్టి టెక్నాలజీ వినియోగించి బంధువులకు,స్నేహితులకు లైవ్ లింక్ పంపి లైవ్ లో పెళ్లి చూస్తూ ఫోన్ లోనే అశీర్వాదం తీసుకుంటున్నారు. […]
దిశ,బోథ్: పెళ్లి అంటే బంధువుల కోలాహలం,స్నేహితుల జోకులు, ఒక పండగలా చేసుకునేవారు. కానీ ఈ మహమ్మారి వలన పెళ్లిల కల తప్పింది. ప్రభుత్వం పెళ్లికి 40 మందినే అనుమతి ఇవ్వడంతో ఎవరిని పెళ్లికి పిలవాలి, ఎవరిని పిలవకూడదో అర్థం కావడం లేదని పెళ్లి వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొందరు బుర్రకు పదను పెట్టి టెక్నాలజీ వినియోగించి బంధువులకు,స్నేహితులకు లైవ్ లింక్ పంపి లైవ్ లో పెళ్లి చూస్తూ ఫోన్ లోనే అశీర్వాదం తీసుకుంటున్నారు. నిర్మల్ కి చెందిన జాటల వికాస్ కు నిజామాబాద్ కి చెందిన ప్రణీతతో పెళ్లి కుదిరింది. అయితే శుక్రవారం నిజామాబాద్లో ఉండగా వారి స్నేహితులు కరోనా నిబంధనల వలన పెళ్లికి హజరుకాలేకపోయారు వాళ్ళ స్నేహితుడు పెళ్లి ది లైవ్ లింక్ పంపుతే వాళ్ళు ఫోన్ లోనే లైవ్ పెళ్లి చూస్తూ తన స్నేహితుడికి శుభాకంక్షలు తెలిపారు. ఎది ఏమైనా పెళ్లిలకు మునపటి కల ఎప్పుడు వస్తుందో చూడాలి.