వేగం పుంజుకున్న సీఆర్‌ఎంపీ రోడ్ల పనులు
దిశ, న్యూస్ బ్యూరో: సమగ్ర రోడ్ల నిర్వహణ కార్యక్రమం (సి.ఆర్.ఎం.పి) కింద చేపట్టిన ప్రధాన రోడ్ల నిర్వహణ పనులను వేగంగా పూర్తి చేసేందుకు కాంట్రాక్ ఏజెన్సీలు లాక్‌డౌన్ నేపథ్యంలో ఏర్పడిన సానుకూల పరిస్థితిని వినియోగించుకుంటున్నాయి. పనులను కొనసాగించేందుకు ప్రభుత్వం కూడా అన్ని అనుమతులను జారీ చేసింది. లాక్‌డౌన్ పీరియడ్‌లోనే ట్రాఫిక్, ఇతర సమస్యలు లేనందున పూర్తి స్థాయిలో తమ శక్తిని కేంద్రీకరించి పనులను పూర్తిచేయాలని 24 గంటలపాటు పనులను కొనసాగిస్తున్నాయి. తదనుగుణంగా ఏప్రిల్ 14 లోపు నిర్దేశించిన […]
దిశ, న్యూస్ బ్యూరో: సమగ్ర రోడ్ల నిర్వహణ కార్యక్రమం (సి.ఆర్.ఎం.పి) కింద చేపట్టిన ప్రధాన రోడ్ల నిర్వహణ పనులను వేగంగా పూర్తి చేసేందుకు కాంట్రాక్ ఏజెన్సీలు లాక్‌డౌన్ నేపథ్యంలో ఏర్పడిన సానుకూల పరిస్థితిని వినియోగించుకుంటున్నాయి. పనులను కొనసాగించేందుకు ప్రభుత్వం కూడా అన్ని అనుమతులను జారీ చేసింది. లాక్‌డౌన్ పీరియడ్‌లోనే ట్రాఫిక్, ఇతర సమస్యలు లేనందున పూర్తి స్థాయిలో తమ శక్తిని కేంద్రీకరించి పనులను పూర్తిచేయాలని 24 గంటలపాటు పనులను కొనసాగిస్తున్నాయి.
తదనుగుణంగా ఏప్రిల్ 14
లోపు నిర్దేశించిన పనులను పూర్తి చేసేందుకు నిర్మాణ సంస్థలకు జీహెచ్‌ఎంసీ ఇంజనీరింగ్ విభాగం పూర్తి సహాయ సహకారాలు అందిస్తోంది. జోనల్ కమిషనర్ల ఆధ్వర్యంలో డిప్యూటీ కమిషనర్లు, జీహెచ్‌ఎంసీ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్లు, పోలీసు అధికారులతో ఏర్పడిన బృందాలు పనులు జరుగుతున్న ప్రదేశంలో పరిస్థితులను మానిటరింగ్ చేస్తున్నాయి. పనులు జరుగుతున్న ప్రదేశాలకు కార్మికులు, మిషనరీ, మెటీరియల్, ట్యాంకర్లు, మిక్సింగ్ ప్లాంట్లు చేరుకునేందుకు ఆటంకాలు రాకుండా అనుమతులను జారీ చేస్తున్నాయి.
ఇతర జిల్లాలు, రాష్ట్రాల
నుంచి వచ్చే యంత్రాలు, మెటీరియల్ సరఫరా వాహనాలకు ఇబ్బందులు తలెత్తకుండా జీహెచ్‌ఎంసీ ఈవీడిఎం డైరెక్టర్ ఆయా ప్రాంతాల పోలీసు అధికారులతో ఎప్పటికప్పుడు సంప్రదిస్తున్నారు. సీఆర్‌ఎంపీ రోడ్ల పనుల ప్రగతిని రోజువారీగా జీహెచ్‌ఎంసీ కమిషనర్ డి.ఎస్. లోకేష్ కుమార్ సమీక్షిస్తున్నారు. అదే సమయంలో పని ప్రదేశంలో పరిశుభ్రమైన ఆరోగ్యకర వాతావరణాన్ని కల్పించాలని, కార్మికులు, సిబ్బందికి రక్షణను కల్పించి సామాజిక దూరం పాటించేవిధంగా అధికారులు పర్యవేక్షిస్తున్నారు. పని ప్రదేశంతోపాటు
మిక్సింగ్ ప్లాంట్ల వద్ద శానిటైజర్లు ఏర్పాటు చేశారు.
జీహెచ్‌ఎంసీ
పరిధిలోని రోడ్లను అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్టుగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో 709 కిలో మీటర్ల పొడవున ఉన్న ప్రధాన రహదారుల నిర్వహణ బాధ్యతను కాంట్రాక్ట్ ఏజెన్సీలకు ప్రభుత్వం అప్పగించింది.
ఏడు ప్యాకేజీలుగా 401 రోడ్ స్ట్రెచ్‌లను ఐదు సంవత్సరాలపాటు అందంగా తీర్చిదిద్దుటకు మరమ్మతులతోపాటు ఆయా రోడ్లలో ఉన్న ఫుట్‌పాత్‌లను సుందరీకరించి సెంట్రల్ మీడియంలను ఏర్పాటు చేసే బాధ్యత కూడా ఏజెన్సీలదే. రెండు సంవత్సరాలపాటు మొత్తం రోడ్లను అన్ని విధాలా అందంగా ఉంచాల్సిన బాధ్యత ఏజెన్సీలపై ఉందని జీహెచ్‌ఎంసీ చీఫ్ ఇంజనీర్ జియా ఉద్దీన్ తెలిపారు.
Tags: roads, hyderabad, GHMC, CRMP, Officers, police, coronavirus