వయసు ఏడాదే.. ఫాలోవర్లు 1.5 మిలియన్
కరోనా లాక్‌డౌన్ కారణంగా ఇంట్లో ఏం చేయాలో తెలియనివాళ్లంతా వంటలు చేయడం మొదలెట్టారు. మరి ఊరికే వంటలు చేస్తే ఏమొస్తుంది.. అందుకే చేసే విధానాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. కొందరైతే ఏకంగా యూట్యూబ్ ఛానళ్లు కూడా పెట్టేశారు. ఇదే కోవలో ఓ ఏడాది వయసు గల పిల్లాడు ఇప్పుడు వంటలు చేస్తూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాడు. ‘షెఫ్ కోబీ’ అంటే ఏడాది వయసున్న పిల్లాడే కాదు.. ఇన్‌స్టాగ్రామ్‌లో 1.5 మిలియన్ల ఫాలోవర్లున్న […]
కరోనా లాక్‌డౌన్ కారణంగా ఇంట్లో ఏం చేయాలో తెలియనివాళ్లంతా వంటలు చేయడం మొదలెట్టారు. మరి ఊరికే వంటలు చేస్తే ఏమొస్తుంది.. అందుకే చేసే విధానాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. కొందరైతే ఏకంగా యూట్యూబ్ ఛానళ్లు కూడా పెట్టేశారు. ఇదే కోవలో ఓ ఏడాది వయసు గల పిల్లాడు ఇప్పుడు వంటలు చేస్తూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాడు. ‘షెఫ్ కోబీ’ అంటే ఏడాది వయసున్న పిల్లాడే కాదు.. ఇన్‌స్టాగ్రామ్‌లో 1.5 మిలియన్ల ఫాలోవర్లున్న సెలెబ్రిటీ కూడా. ఏడాది పిల్లాడేంటి ? వంటలు చేయడమేంటని అనుకుంటున్నారా? అదేం లేదండీ.. వాళ్లమ్మ యాష్లీ వెయిన్ పక్కనే ఉండి అతనికి సాయం చేస్తుంటుంది. కానీ, వీడియోలో మాత్రం ముద్దుముద్దుగా మాట్లాడుతూ, కూరగాయలు కత్తిరించే కోబీ మాత్రమే కనిపిస్తాడు.
ఫిబ్రవరిలో ఇలా వంటలు చేసిన వీడియోలను కోబీ తల్లిదండ్రులు యాష్లీ, కైల్‌లు ‘కోబీ ఈట్స్’ పేరుతో ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేయడం ప్రారంభించారు. తమ పిల్లాడి వీడియోలకు మంచి స్పందన వచ్చి, ఫాలోవర్ల సంఖ్య పెరగడంతో వారు ఈ వీడియోలను కంటిన్యూ చేశారు. అలా ఇప్పుడు ఒక వెబ్‌సైట్ కూడా పెట్టి మర్చండైజ్ అమ్ముతున్నారు. ఓ వైపు కరోనా వైరస్ కారణంగా ప్రపంచం మొత్తం ఇబ్బంది పడుతుంటే, తమ అబ్బాయి వీడియోలు ఇతరులకు ఆనందాన్ని పంచడం సంతోషంగా ఉందని కైల్ అన్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం ? మీరు కూడా కోబీ ముద్దుముద్దుగా చేస్తున్న వంటలను అతని ఇన్‌స్టాగ్రాంలో చూసేయండి మరి!