ఒక నెలలో ప్లాస్మా ఎన్నిసార్లు ఇవ్వొచ్చంటే..

దిశ, వెబ్ డెస్క్: దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నా.. రికవరీ రేటు ఎక్కువగా ఉండటం కొద్దిగా ఊరట కలిగించే అంశం. అయితే, కరోనా కల్లోలం ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో వైరస్ బారి నుంచి కోలుకున్న వ్యక్తులు ప్లాస్మా దానం చేయాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు విజ్ఞప్తి చేస్తున్నాయి. ప్లాస్మాదానం వలన మరికొంతమంది రోగులు కోలుకునే అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికి ప్లాస్మా చికిత్స సత్ఫలితాలు ఇస్తున్న సంగతి తెలిసిందే. ఢిల్లీలో కరోనా మహమ్మారి నుంచి కోలుకున్న పోలీసులు సైతం […]

Update: 2020-07-19 09:21 GMT

దిశ, వెబ్ డెస్క్: దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నా.. రికవరీ రేటు ఎక్కువగా ఉండటం కొద్దిగా ఊరట కలిగించే అంశం. అయితే, కరోనా కల్లోలం ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో వైరస్ బారి నుంచి కోలుకున్న వ్యక్తులు ప్లాస్మా దానం చేయాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు విజ్ఞప్తి చేస్తున్నాయి. ప్లాస్మాదానం వలన మరికొంతమంది రోగులు కోలుకునే అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికి ప్లాస్మా చికిత్స సత్ఫలితాలు ఇస్తున్న సంగతి తెలిసిందే.

ఢిల్లీలో కరోనా మహమ్మారి నుంచి కోలుకున్న పోలీసులు సైతం ప్లాస్మా దానం చేసేందుకు ముందుకు వచ్చారు. దాదాపు 2,532 మంది పోలీసులు అక్కడ కరోనా బారిన పడ్డారు. ఇందులో కొంతమంది ఇప్పటికే కోలుకున్నారు. కరోనా మహమ్మారి నుంచి కోలుకున్న వారు ప్లాస్మాదానం కోసం ముందుకు వస్తున్నారు. అయితే, ప్లాస్మాదానం నెలలో రెండుసార్లు చెయ్యొచ్చని, అంతకు మించి ఎక్కువసార్లు చేయకూడదని వైద్యాధికారులు చెబుతున్నారు.

Tags:    

Similar News