ఇన్ఫార్మర్ నెపంతో దారుణ హత్య
దిశ, కరీంనగర్ ప్రతినిధి: పోలీస్ ఇన్ఫార్మర్ల పేరుతో ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేశారు మావోయిస్టులు. ఈ ఘటన ఏపీ-ఒడిశా సరిహద్దులో గల మల్కాన్గిరి జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మంగళవారం రాత్రి 10 మందికి పైగా మావోయిస్టులు జొడంబా పోలీసు స్టేషన్ పరిధిలోని ఖజిరిగూడ గ్రామంలోకి ప్రవేశించి దాస్ కీముడు, సనా హతుల్, సమ్రు ఖిల్లా అనే ముగ్గురు వ్యక్తులపై దాడి చేసినట్లు తెలుస్తోంది. అనంతరం దాస్ కీముడును గొంతు కోసి హత్య చేశారు. భద్రతా […]
దిశ, కరీంనగర్ ప్రతినిధి: పోలీస్ ఇన్ఫార్మర్ల పేరుతో ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేశారు మావోయిస్టులు. ఈ ఘటన ఏపీ-ఒడిశా సరిహద్దులో గల మల్కాన్గిరి జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మంగళవారం రాత్రి 10 మందికి పైగా మావోయిస్టులు జొడంబా పోలీసు స్టేషన్ పరిధిలోని ఖజిరిగూడ గ్రామంలోకి ప్రవేశించి దాస్ కీముడు, సనా హతుల్, సమ్రు ఖిల్లా అనే ముగ్గురు వ్యక్తులపై దాడి చేసినట్లు తెలుస్తోంది. అనంతరం దాస్ కీముడును గొంతు కోసి హత్య చేశారు. భద్రతా దళాలను లక్ష్యంగా చేసుకుని ల్యాండ్‌మైన్‌లు వేసే పథకం గురించి పోలీసులకు చెప్పి అప్రమత్తం చేశారనే కారణంతో మావోయిస్టులు దారుణంగా హత్య చేసినట్టు సమాచారం. సమాచారం అందుకున్న భద్రతా బలగాలు ఆ ప్రాంతానికి వెళ్లి గాలింపు చర్యలు చేపట్టారు.