బాలుడిపై విచక్షణ రహితంగా దాడి
దిశ, హైదరాబాద్: నేరెడ్‌మెట్ ప్రాంతంలోని క్రికెట్ ఆడుకుంటుండుగా.. బాల్ తగిలిందనే నేపంతో ఓ వ్యక్తి బాలుడిని చితకబాదాడు. స్థానిక రామకృష్ణాపురంలో 15 సంవత్సరాల ధాత్రేయన్ ఇంటి బయట క్రికెట్ ఆడుకుంటుండుగా.. ధాత్రేయన్ విసిరిన బాల్ తగిలిందంటూ ఓ వ్యక్తి బాలుడిని తీవ్రంగా గాయపరిచాడు. ఈ ఘటనకు బాధ్యుడైన వ్యక్తిని సీసీ కెమెరాల ఆధారంగా కనుగొని.. బాలుడిపై విచక్షణ రహితంగా దాడి చేసిన వ్యక్తిపై హత్యాహత్నం కేసు నమోదు చేయాలని బాలల హక్కుల సంఘం అధ్యక్షులు అచ్యుతరావు డిమాండ్ […]
దిశ, హైదరాబాద్: నేరెడ్‌మెట్ ప్రాంతంలోని క్రికెట్ ఆడుకుంటుండుగా.. బాల్ తగిలిందనే నేపంతో ఓ వ్యక్తి బాలుడిని చితకబాదాడు. స్థానిక రామకృష్ణాపురంలో 15 సంవత్సరాల ధాత్రేయన్ ఇంటి బయట క్రికెట్ ఆడుకుంటుండుగా.. ధాత్రేయన్ విసిరిన బాల్ తగిలిందంటూ ఓ వ్యక్తి బాలుడిని తీవ్రంగా గాయపరిచాడు. ఈ ఘటనకు బాధ్యుడైన వ్యక్తిని సీసీ కెమెరాల ఆధారంగా కనుగొని.. బాలుడిపై విచక్షణ రహితంగా దాడి చేసిన వ్యక్తిపై హత్యాహత్నం కేసు నమోదు చేయాలని బాలల హక్కుల సంఘం అధ్యక్షులు అచ్యుతరావు డిమాండ్ చేశారు. నగరంలో పిల్లల అవసరాలకు తగ్గట్టుగా సరైన ఆటస్ధళాలను జీహెచ్ఎంసీ కల్పించని కారణంగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ఆయన అన్నారు.
Tags: man attack, child, Child Rights Association, Play Grounds, GHMC