ఏపీలో నాలుగుకు చేరిన ఒమిక్రాన్ కేసులు

దిశ, ఏపీ బ్యూరో: ఏపీలో మరో రెండు ఒమిక్రాన్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య నాలుగుకు చేరింది. విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాలో చెరో కేసు నమోదైనట్లు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ స్పష్టం చేశారు. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన 41ఏళ్ల మహిళకు ఒమిక్రాన్‌ నిర్ధారణ అయినట్లు తెలిపింది. సదరు మహిళ ఈనెల 19న కువైట్‌ నుంచి విజయవాడకు చేరుకుంది.  అక్కడి నుంచి స్వస్థలం అయినవిల్లి మండలం నేదునూరు వెళ్లింది. ఆమె నమూనాలను […]

Update: 2021-12-24 05:58 GMT

దిశ, ఏపీ బ్యూరో: ఏపీలో మరో రెండు ఒమిక్రాన్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య నాలుగుకు చేరింది. విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాలో చెరో కేసు నమోదైనట్లు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ స్పష్టం చేశారు. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన 41ఏళ్ల మహిళకు ఒమిక్రాన్‌ నిర్ధారణ అయినట్లు తెలిపింది. సదరు మహిళ ఈనెల 19న కువైట్‌ నుంచి విజయవాడకు చేరుకుంది. అక్కడి నుంచి స్వస్థలం అయినవిల్లి మండలం నేదునూరు వెళ్లింది. ఆమె నమూనాలను జీనోమ్‌ సీక్వెన్సింగ్‌కు పంపగా ఒమిక్రాన్‌ నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని తూర్పుగోదావరి జిల్లా అదనపు డీఎంహెచ్‌వో వెల్లడించారు. మహిళ భర్త, పిల్లలకు కరోనా నెగెటివ్‌ వచ్చిందని.. మరోసారి వైద్య పరీక్షలు నిర్వహిస్తామని అదనపు డీఎంహెచ్‌వో తెలిపారు.

ఇదిలా ఉంటే విశాఖలో ఒమిక్రాన్‌ కేసు నమోదైంది. ఈ నెల 15న దుబాయ్‌ నుంచి వచ్చిన ఓ 33ఏళ్ల యువకుడికి ఒమిక్రాన్ పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. బాధితుడి ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని అధికారులు వెల్లడించారు. ఒమిక్రాన్‌ సోకిన వ్యక్తిని హోమ్ ఐసొలేషన్‌లో ఉంచినట్లు స్పష్టం చేశారు. మొత్తం 53 మంది విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చారని అయితే వారిలో 9 మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు ఏపీ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ తెలిపారు. వారంతా క్షేమంగా ఉన్నట్లు తెలిపారు. పుకార్లు నమ్మవద్దని సూచించారు. అయితే భౌతిక దూరం, మాస్క్ ధరించడం, చేతులు శుభ్రం చేసుకోవడం వంటివి తరచూ చేయాలని సూచించారు. అలాగే కొవిడ్ నిబంధనలు కచ్చితంగా పాటించాలని సూచించారు.

Tags:    

Similar News