జపాన్ చేరిన ఒలింపిక్ జ్యోతి

ఒలింపిక్స్ అనగానే ముందు గుర్తుకు వచ్చేది ఒలింపిక్ టార్చ్ (జ్యోతి). ఈసారి ఒలింపిక్స్ జపాన్‌లోని టోక్యోలో జరుగుతున్న విషయం తెలిసిందే. కరోనా మహమ్మారి కారణంగా ఒలింపిక్స్ నిర్వహణ సందిగ్ధంలో పడింది. ఈ నేపథ్యంలో ఒలంపిక్ టార్చ్ గ్రీస్ నుంచి శుక్రవారం జపాన్ చేరుకుంది. ‘హోప్ లైట్స్ అవర్ వే’ అని రాసున్న ప్రతేక విమానం ఒలింపిక్ జ్యోతితో టోక్యోలోని మిలటరీ బేస్ ఎయిర్‌పోర్టులో దిగింది. కరోనా భయంతో ఈ వేడుకకు ప్రజలెవరినీ అనుమతించలేదు. జపాన్‌లో ప్రముఖ క్రీడాకారులైన […]

Update: 2020-03-21 04:22 GMT

ఒలింపిక్స్ అనగానే ముందు గుర్తుకు వచ్చేది ఒలింపిక్ టార్చ్ (జ్యోతి). ఈసారి ఒలింపిక్స్ జపాన్‌లోని టోక్యోలో జరుగుతున్న విషయం తెలిసిందే. కరోనా మహమ్మారి కారణంగా ఒలింపిక్స్ నిర్వహణ సందిగ్ధంలో పడింది. ఈ నేపథ్యంలో ఒలంపిక్ టార్చ్ గ్రీస్ నుంచి శుక్రవారం జపాన్ చేరుకుంది. ‘హోప్ లైట్స్ అవర్ వే’ అని రాసున్న ప్రతేక విమానం ఒలింపిక్ జ్యోతితో టోక్యోలోని మిలటరీ బేస్ ఎయిర్‌పోర్టులో దిగింది. కరోనా భయంతో ఈ వేడుకకు ప్రజలెవరినీ అనుమతించలేదు. జపాన్‌లో ప్రముఖ క్రీడాకారులైన సౌరీ యోషిడా, తదా దాహిరో నోమురా ఈ జ్యోతిని అందుకున్నారు. అనంతరం వాళ్లు ఆ జ్యోతిని ఒలింపిక్ నిర్వహణ కమిటీ అధ్యక్షుడు యోషిరో మెరీకి అప్పగించారు.

Tags : Olympic Torch, Japan, Tokyo, Special Airplane, Greece

Tags:    

Similar News