పిల్లలు, వృద్ధులు జాగ్రత్త.. ఇది మీకోసమే!

దిశ, వెబ్‌డెస్క్ : దీపావళి పండుగ పర్వదినాన పెద్దలు దేవుడి ఆరాధనలో బిజీగా ఉంటే చిన్నపిల్లలు మాత్రం చాలా ఎంజాయ్ చేస్తుంటారు. క్రాకర్స్ కాల్చేందుకు వాళ్లు చూపిస్తే ఉత్సాహం అంతా ఇంతాకాదు. ఆ సమయంలో వారిని ఓ కంట కనిపెడుతూ ఉండాలి. లేనియెడల పెనుప్రమాదాలు చోటుచేసుకునే అవకాశం లేకపోలేదు. క్రాకర్స్ కాల్చే సమయంలో వెలువడే నిప్పురవ్వలు, పెద్ద టాపాసుల శబ్దం, టాపాసులు నుంచి వెలువడే పొగ చిన్న పిల్లలను అనారోగ్యానికి గురిచేస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.పేరేంట్స్ తప్పనిసరిగా వారిని […]

Update: 2020-11-13 22:55 GMT

దిశ, వెబ్‌డెస్క్ : దీపావళి పండుగ పర్వదినాన పెద్దలు దేవుడి ఆరాధనలో బిజీగా ఉంటే చిన్నపిల్లలు మాత్రం చాలా ఎంజాయ్ చేస్తుంటారు. క్రాకర్స్ కాల్చేందుకు వాళ్లు చూపిస్తే ఉత్సాహం అంతా ఇంతాకాదు. ఆ సమయంలో వారిని ఓ కంట కనిపెడుతూ ఉండాలి. లేనియెడల పెనుప్రమాదాలు చోటుచేసుకునే అవకాశం లేకపోలేదు. క్రాకర్స్ కాల్చే సమయంలో వెలువడే నిప్పురవ్వలు, పెద్ద టాపాసుల శబ్దం, టాపాసులు నుంచి వెలువడే పొగ చిన్న పిల్లలను అనారోగ్యానికి గురిచేస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.పేరేంట్స్ తప్పనిసరిగా వారిని టాపాసులకు దూరంగా ఉంచాలని సూచిస్తున్నారు.

కార్భన్, పోటాషియం కాల్చినపుడు వెలువడే పొగ విషపూరితంగా మారుతుందని, దానిని పీల్చినపుడు ఊపిరితిత్తుల సమస్యలు, దగ్గు, అలర్జీ ఏర్పడవచ్చునని చెప్పారు. అది తీవ్రస్థాయిలో ఉన్నప్పుడు న్యూమోనియా బారిన పడే అవకాశం కూడా ఉందని చెబుతున్నారు.

ప్రస్తుత కరోనా సమయంలో వృద్ధులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. కొవిడ్ లక్షణాలున్న వృద్ధులు టాపాసులు కాల్చినపుడు వెలువడే పొగ పీలిస్తే తీవ్రమైన శ్వాస సంబంధిత ఇబ్బందులు ఏర్పడే ప్రమాదముంది. అంతేకాకుండా, పొగ వలన దగ్గితే తమ నుంచి వైరస్ ఇతరులకు సైతం వ్యాప్తి ప్రమాదం లేకపోలేదు. సాధ్యమైనంత వరకు పండుగ రోజున వృద్ధులు బయటకు రాకుండే ఉంటేనే బెటర్ అని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఈ పండుగ అందరి ఇళ్లల్లోనూ వెలుగులు నింపాలి అనుకుంటే పర్యావరణహితమైన గ్రీన్ క్రాకర్స్ మాత్రమే వినియోగించాలని, అలా అయితే ప్రస్తుత సమయంలో అందరూ సేఫ్ అండ్ సంతోషంగా ఉండొచ్చని పలువురు అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు.

Tags:    

Similar News