బతికుండగానే చంపేశారు..పింఛన్ దారుడి ఆవేదన

దిశ, వరంగల్: రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం ఓ వృద్ధుడి పాలిట శాపంగా మారింది. అతను బతికుండగానే చనిపోయాడంటూ అధికారులు నివేదిక ఇవ్వడంతో నెలవారీగా వచ్చే పింఛన్ రావడం లేదు. దీంతో తనకు న్యాయం చేయాలంటూ వరంగల్ రూరల్ కలెక్టర్‌ ఎం.హరితకు మొరపెట్టుకున్నాడు. ఈ ఘటన వరంగల్ రూరల్లో మంగళవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..జిల్లాలోని ఆత్మకూరు మండలం లింగమడుగుపల్లికి‌ చెందిన దుడ్డు మల్లయ్యకు ఎనిమిది నెలలుగా పింఛన్ రావడం ఆగిపోయింది.ఈ విషయమై బాధితుడు పలుమార్లు వీఆర్ఓను కలిసి […]

Update: 2020-06-09 07:08 GMT

దిశ, వరంగల్:
రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం ఓ వృద్ధుడి పాలిట శాపంగా మారింది. అతను బతికుండగానే చనిపోయాడంటూ అధికారులు నివేదిక ఇవ్వడంతో నెలవారీగా వచ్చే పింఛన్ రావడం లేదు. దీంతో తనకు న్యాయం చేయాలంటూ వరంగల్ రూరల్ కలెక్టర్‌ ఎం.హరితకు మొరపెట్టుకున్నాడు. ఈ ఘటన వరంగల్ రూరల్లో మంగళవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..జిల్లాలోని ఆత్మకూరు మండలం లింగమడుగుపల్లికి‌ చెందిన దుడ్డు మల్లయ్యకు ఎనిమిది నెలలుగా పింఛన్ రావడం ఆగిపోయింది.ఈ విషయమై బాధితుడు పలుమార్లు వీఆర్ఓను కలిసి తన గోడు వెల్లబోసుకున్నాడు.అయినా ఫలితం లేకపోవడంతో మల్లయ్య ఎంపీడీఓను కలిసి ఫిర్యాదు చేశాడు. ఎంపీడీఓ తిరిగి రికార్డులను పరిశీలించగా మల్లయ్య చనిపోయినట్టు నమోదు చేసి ఉన్నట్టు గుర్తించాడు. అందువల్లే పింఛన్ జాబితా నుంచి మీ పేరు తొలగించారని సమాధానం ఇచ్చారు.ఈ మేరకు బాధితుడు రూరల్ కలెక్టర్‌ను కలిసి తాను బతికి ఉండగానే చనిపోయినట్టు రెవెన్యూ అధికారులు నిర్దారించారని, అందువల్లే తనకు పింఛన్ రావడం లేదని.. ఇప్పుడైనా న్యాయం చేయాలంటూ వినతి పత్రం అందజేశాడు.

Tags:    

Similar News