చావు భయంతో చంపేందుకు కుట్ర.. సుపారీ గ్యాంగ్ అరెస్టు!

దిశ, సూర్యాపేట : తనను చంపుతాడనే భయంతో ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి శశిధర్ రెడ్డి హత్యలో ప్రధాన నిందితుడైన ఆయిల్ శ్రీనును మట్టుబెట్టాలనే ఉద్దేశ్యంతో సుపారీ గ్యాంగ్‌ను సిద్ధం చేసుకున్నాడు కుడకుడకు చెందిన ఓ ప్రముఖ రియల్టర్.. ఈ ఏడాది ఫిబ్రవరి 2న కుడకుడలో శశిధర్ రెడ్డి హత్యకు గురైన విషయం తెలిసిందే.. కుడకుడ రెవెన్యూ శివారులోని 225, 226, 227 సర్వే నెంబర్‌లోని 7ఎకరాల భూ పంచాయితీ విషయంలో రాజీ కుదరకనే ఈ హత్య […]

Update: 2021-06-04 10:57 GMT

దిశ, సూర్యాపేట : తనను చంపుతాడనే భయంతో ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి శశిధర్ రెడ్డి హత్యలో ప్రధాన నిందితుడైన ఆయిల్ శ్రీనును మట్టుబెట్టాలనే ఉద్దేశ్యంతో సుపారీ గ్యాంగ్‌ను సిద్ధం చేసుకున్నాడు కుడకుడకు చెందిన ఓ ప్రముఖ రియల్టర్.. ఈ ఏడాది ఫిబ్రవరి 2న కుడకుడలో శశిధర్ రెడ్డి హత్యకు గురైన విషయం తెలిసిందే.. కుడకుడ రెవెన్యూ శివారులోని 225, 226, 227 సర్వే నెంబర్‌లోని 7ఎకరాల భూ పంచాయితీ విషయంలో రాజీ కుదరకనే ఈ హత్య జరిగినట్లు పోలీసుల విచారణలో తేలింది.ఈ హత్యలో ప్రధాన నిందితుడు ఆయిల్ శ్రీనుతో పాటు మరో పది మందిని ఫిబ్రవరి16న అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఇటీవల వీరంతా బెయిల్‌పై బయటకు వచ్చారు. బెయిల్ పై బయటకు వచ్చిన ఆయిల్ శ్రీను తనను ఎలాగైనా మట్టుబెడతాడనే ఉద్దేశ్యంతో కుడకుడకు చెందిన ఓ రియల్టర్, హత్యకు గురైన శశిధర్ రెడ్డి మిత్రుడు ఎలాగైనా అదును చూసి నిందితుడిని హత్య చేయాలనే ఉద్దేశ్యంతో వరంగల్, తొర్రురు, దంతాలపల్లి, కుడకుడకు చెందిన 8 మంది వ్యక్తులకు సుపారీ ఇచ్చి ఓ ఇంట్లో ఉంచాడు.
సమాచారం అందుకున్న పోలీసులు ఐదుగురిని మంగళవారం తెల్లవారు జామున(గత మూడు రోజుల కిందట) అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అసలు సూత్రధారితో పాటు మరో ముగ్గురు పరారీలో ఉన్నట్లు తేలింది.

శశిధర్ రెడ్డి హత్యలో ప్రధాన నిందితుడు ఆయిల్ శ్రీను భార్య పద్మ శ్రీ, తన కుమార్తె పేరు మీద ఉన్న భూమిని శశిధర్ రెడ్డికి తక్కువ ధరకు అమ్మివ్వడంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తే హంతక ముఠాను సిద్ధం చేసిన సూత్రధారిగా తెలుస్తుంది. ఇతనికి చనిపోయిన వ్యక్తి తరఫున నుంచి వివాహేతర సంబంధం ఉన్న కారణంగానే భూమిని తక్కువ ధరకు అమ్మించి పలు వివాదాలకు కారణమైనట్లు సమాచారం. ఈ వ్యక్తిని గతంలో శశిధర్ రెడ్డి హత్యలో కూడా పోలీసులు విచారించినట్లు తెలుస్తోంది. సూత్రధారికి పలువురు రాజకీయ నాయకులు కూడా సహకరించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. గతంలో జరిగిన హత్యలో పోలీసులు పలు ఆరోపణలు ఎదుర్కోవడంతో ఈసారి అలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా అన్ని కోణాల్లో విచారణ జరిపి నిందితులు ఎంతటి వారైనా వదలకుండా చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. ఏదిఏమైనా పోలీసులు పూర్తి వివరాలు వెల్లడించే వరకు ఎదురుచూడాల్సిందే.

Tags:    

Similar News