భద్రాద్రి పవర్ ప్లాంట్ ఉద్యోగుల మాయ.. ఇల్లు, వాకిలి అమ్ముకున్న యువకులు
దిశ, మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం మణుగూరు మండలం చిక్కుడు గుంట ప్రాంతంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన భద్రాద్రి పవర్ ప్లాంట్ లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ కొందరు వ్యక్తులు ప్లాంట్ అధికారుల సహాయంతో అమాయకమైన ప్రజల నుంచి లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారని సమాచారం. జేపీఓ అధికారులు ప్లాంట్ లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ కొంతమంది యువకుల నుంచి రూ. 3 లక్షల వరకు వసూలు చేసి ఉద్యోగాలు ఇవ్వకుండా మోసం చేశారని బాధిత […]
దిశ, మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం మణుగూరు మండలం చిక్కుడు గుంట ప్రాంతంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన భద్రాద్రి పవర్ ప్లాంట్ లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ కొందరు వ్యక్తులు ప్లాంట్ అధికారుల సహాయంతో అమాయకమైన ప్రజల నుంచి లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారని సమాచారం. జేపీఓ అధికారులు ప్లాంట్ లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ కొంతమంది యువకుల నుంచి రూ. 3 లక్షల వరకు వసూలు చేసి ఉద్యోగాలు ఇవ్వకుండా మోసం చేశారని బాధిత యువకులు చెబుతున్నారు.
ప్లాంట్ లో ఉద్యోగం వస్తుందని నమ్మిన కొంతమంది యువకులు ఇల్లు, వాకిలి అమ్మి లక్షల రూపాయలు కొంతమంది జేపీఓ అధికారులకు ఇస్తే వారు ఉద్యోగాలు ఇప్పించకుండా మోసం చేశారని వారు వాపోతున్నారు. జేపీఓ అధికారులు కొందరిని మధ్యవర్తులుగా ఏర్పాటు చేసుకుని అమాయకులైన యువకుల నుంచి ఉద్యోగాల పేరుతో రూ. లక్షలు వసూలు చేస్తున్నారని సమాచారం. ప్లాంట్ లోకి వెళ్లేందుకు గెట్ పాస్ కోసం కూడా రూ. 5 వేల నుంచి రూ. 10 వేల వరకు వసూలు చేసినట్లు తెలుస్తోంది. రూ. లక్షలు వసూలు చేసిన జాబితాలో జేపీఓ అధికారులతోపాటు ఇంకా ఎంతమంది అధికారులు ఉన్నారనేది మండలంలో జోరుగా చర్చ నడుస్తోంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు చర్యలు చేపట్టి డబ్బులు వసూలు చేసిన అధికారులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు, ప్రజా సంఘాలు, మహిళా సంఘాలు, విద్యార్థి నాయకులు కోరుతున్నారు.