కొంపల్లిలోని ఓ హోటల్‌‌లో కోవిడ్-19 అలజడి

దిశ, మేడ్చల్‌: ప్రపంచాన్ని వణికిస్తున్న కోవిడ్-19 హైదరాబాద్ నగర శివారులోని కొంపల్లి మున్సిపాలిటీలో అలజడి రేపింది. కొంపల్లికి చెందిన ఓ 32 సంవత్స రాల మహిళ ఇటీవల ఇటలీ దేశం నుండి నగరానికి వచ్చింది. 28వ తేదిన కొంపల్లి జాతీయ రహదారి సినీప్లానెట్ పక్కన ఉన్న హోటల్లో ఆమె బసచేసింది. అనంతరం ఆమె మరొక హోటల్‌కు వెళ్ళటం ఆ తరువాత కరోనా వైరస్ లక్షణాలతో బాధ పడటంతో గాంధీ ఆస్పత్రిలో చేర్చారు. ఈ మేరకు రంగంలోకి దిగిన […]

Update: 2020-03-04 21:09 GMT

దిశ, మేడ్చల్‌: ప్రపంచాన్ని వణికిస్తున్న కోవిడ్-19 హైదరాబాద్ నగర శివారులోని కొంపల్లి మున్సిపాలిటీలో అలజడి రేపింది. కొంపల్లికి చెందిన ఓ 32 సంవత్స రాల మహిళ ఇటీవల ఇటలీ దేశం నుండి నగరానికి వచ్చింది. 28వ తేదిన కొంపల్లి జాతీయ రహదారి సినీప్లానెట్ పక్కన ఉన్న హోటల్లో ఆమె బసచేసింది. అనంతరం ఆమె మరొక హోటల్‌కు వెళ్ళటం ఆ తరువాత కరోనా వైరస్ లక్షణాలతో బాధ పడటంతో గాంధీ ఆస్పత్రిలో చేర్చారు. ఈ మేరకు రంగంలోకి దిగిన వైద్య శాఖ అధికారులు పూర్తి దర్యాప్తు చేస్తున్నారు. కొంపల్లికి చేరుకున్న వైద్య శాఖ అధికారులు ఆమె బసచేసిన హోటల్లో తనిఖీలు చేశారు. హోటల్ వారు అధికారులకు సహకారాన్ని అందించక పోవటంతో పరిస్థితి కాస్త జటిలంగా మారింది. ఈ మేరకు సమాచారం అందుకున్న పేట్ బషీరాబాద్ పోలీసులు, కొంపల్లి మున్సిపల్ కమిషనర్ ఎం.ఎన్ ఆర్ జ్యోతితో కలిసి హోటల్‌కు చేరుకొని వైద్య శాఖ అధికారులకు సహకరించాలని హోటల్ సిబ్బందిని కోరడంతో.. వివరాల సేకరణ లాంఛనమైంది.

Tags: covid-19, kompally, women, officials

Tags:    

Similar News