అర్ధాంతరంగా నిలిచిన డ్రైనేజీ పనులు.. గుంతలతో రాకపోకలకు ఇబ్బందులు 

దిశ, కుత్బుల్లాపూర్ : అధికారుల నిఘా లోపమో.. కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యమో ఏమో గానీ అర్ధాంతరంగా నిలిచిన అభివృద్ధి పనులకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నెలల తరబడి పనులు జరగకపోగా అందులో పడుతూ ప్రమాదాలకు గురవుతున్నారు. కుత్బుల్లాపూర్ సర్కిల్ పరిధిలోని ఏ డివిజన్‌లో చూసినా ఇలాంటి సంఘటనలే దర్శనమిస్తుయి. ప్రణాళిక లేకుండా గతంలో చిన్న డ్రైనేజీ పైప్ లైన్‌లు వేసి ఆవెంటనే సీసీ రోడ్లను వేశారని, ప్రస్తుతం డ్రైనేజీ సమస్య పేరుతో సీసీ రోడ్లు తవ్వించి పెద్ద లైన్‌ల పేరుతో […]

Update: 2021-12-28 04:07 GMT

దిశ, కుత్బుల్లాపూర్ : అధికారుల నిఘా లోపమో.. కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యమో ఏమో గానీ అర్ధాంతరంగా నిలిచిన అభివృద్ధి పనులకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నెలల తరబడి పనులు జరగకపోగా అందులో పడుతూ ప్రమాదాలకు గురవుతున్నారు. కుత్బుల్లాపూర్ సర్కిల్ పరిధిలోని ఏ డివిజన్‌లో చూసినా ఇలాంటి సంఘటనలే దర్శనమిస్తుయి. ప్రణాళిక లేకుండా గతంలో చిన్న డ్రైనేజీ పైప్ లైన్‌లు వేసి ఆవెంటనే సీసీ రోడ్లను వేశారని, ప్రస్తుతం డ్రైనేజీ సమస్య పేరుతో సీసీ రోడ్లు తవ్వించి పెద్ద లైన్‌ల పేరుతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారన్న ఆరోపణలు లేకపోలేదు. ఉన్నతాధికారులు స్పందించి పనులు పూర్తయ్యేలా చూడాలని, ప్రజాధనం వృధా కాకుండా చొరవ తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.

* సుభాశ్ నగర్ డివిజన్ పరిధిలో భాగ్యలక్ష్మి కాలనీ రోడ్ నెంబర్ -1లో గత రెండు నెలల క్రితం రోడ్డును తవ్వించి డ్రైనేజీ లైన్ పనులు పూర్తి

చేయకుండా వదిలేశారు. భారీ గుంతలో పడకుండా స్థానికులు ఓ చెక్కను హెచ్చరిక బోర్డుగా పెట్టుకున్నారు. దీనిని బట్టి అధికారులు ఆ వైపు

కన్నెత్తి కూడా చూడటం లేదని తెలుస్తోంది.

* అదే రోడ్డు రాములు యాదవ్ ఇంటి ఎదురుగా డ్రైనేజీ లైన్ వేస్తామని సీసీ రోడ్డును తవ్వి వదిలేశారు.

* జీడిమెట్ల డివిజన్ పరిధి పాత ఎక్సైజ్ పీఎస్ ఎదురు రోడ్డును గత వర్షాకాలం రాకముందే డ్రైనేజీ లైన్ వేసి ప్యాచ్‌లు చేయడం మరిచారు.

Tags:    

Similar News