12 నుంచి ఇంటర్మీడియట్ వాల్యుయేషన్ షురూ

దిశ, నిజామాబాద్: ఇంటర్ జవాబు పత్రాలు దిద్దే కార్యక్రమం (వాల్యుయేషన్) ఈ నెల 12 నుంచి షురూ కానుంది. 2019-20 విద్యా సంవత్సరం ఇంటర్ పరీక్షలు మార్చి 4 నుంచి 18 వరకు జరిగాయి. వాస్తవంగా మార్చి 20 నుంచి వాల్యుయేషన్ జరగాల్సింది. కానీ, లాక్ డౌన్‌తో ఆగింది. 12 నుంచి ప్రక్రియ ప్రారంభం కానున్న సందర్భంగా అధికారులు అందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పాత జిల్లా ప్రాతిపదికన వాల్యుయేషన్ కేంద్రాలు సిద్ధం చేశారు. అక్కడ ఫిజికల్ డిస్టెన్స్(భౌతిక […]

Update: 2020-05-10 06:44 GMT

దిశ, నిజామాబాద్: ఇంటర్ జవాబు పత్రాలు దిద్దే కార్యక్రమం (వాల్యుయేషన్) ఈ నెల 12 నుంచి షురూ కానుంది. 2019-20 విద్యా సంవత్సరం ఇంటర్ పరీక్షలు మార్చి 4 నుంచి 18 వరకు జరిగాయి. వాస్తవంగా మార్చి 20 నుంచి వాల్యుయేషన్ జరగాల్సింది. కానీ, లాక్ డౌన్‌తో ఆగింది. 12 నుంచి ప్రక్రియ ప్రారంభం కానున్న సందర్భంగా అధికారులు అందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పాత జిల్లా ప్రాతిపదికన వాల్యుయేషన్ కేంద్రాలు సిద్ధం చేశారు. అక్కడ ఫిజికల్ డిస్టెన్స్(భౌతిక దూరం) పాటించాలని చెబుతున్నారు. స్పాట్ కేంద్రాలను 11 నుంచి 33కు పెంచారు.

పేపర్‌కు రూ.18.93 పైసలు..

ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన క్యాంప్ ఆఫీసర్‌గా జిల్లా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ వ్యవహరించగా ఇప్పుడు అదే మాదిరిగా కొత్తగా ఏర్పడే క్యాంపు‌లకు అడిషనల్ క్యాంప్ ఆఫీసర్లు సహాయకులుగా పని చేస్తారు. మూడ్రోజుల నుంచి బోర్డు అధికారులు జవాబు పత్రాల డీకోడింగ్ ప్రక్రియ చేపడుతున్నారు. సుమారు 55 లక్షల జవాబు పత్రాలను దిద్దే కార్యక్రమం కోసం 15 వేల మందిలో అసిస్టెంట్ క్యాంపు ఆఫీసర్‌లు, అసిస్టెంట్ ఎగ్జామినర్, చీప్ ఎగ్జామినర్లు, సబ్జెక్ట్ ఎక్స్ పర్ట్‌లను నియమించారు. గతంలో మాదిరిగానే ప్రభుత్వ, ఎయిడెడ్, రెసిడెన్షియల్, గురుకులాల అధ్యాపకులతో పాటు ప్రైవేటు జూనియర్ కాలేజీల లెక్చరర్లను తీసుకుంటున్నారు. అయితే, ఈసారి ప్రతి లెక్చరర్ రోజూ 45 పేపర్లు దిద్దాలని బోర్డు నిర్దేశించింది. గతంలో 30 పేపర్‌లు మాత్రమే దిద్దేవారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఇంటర్మీడియట్ స్పాట్ కేంద్రాలు పనిచేస్తాయి. ఈ స్పాట్ కేంద్రాలు సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. పేపర్‌కు రూ.18.93 పైసలుగా బోర్డు నిర్ణయించింది.

నెలరోజుల్లో ఫలితాలు..

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఏటా ఇంటర్మీడియట్ జవాబు పత్రాల(సీనియర్ ప్లస్ జూనియర్) మూల్యాంకనం ఒకే సారి చేసి ఫలితాలను విడుదల చేసేవారు. కానీ, కొవిడ్ కట్టడికి విధించిన లాక్ డౌన్ నేపథ్యంలో భవిష్యత్తులో జరిగే ప్రవేశ పరీక్షలు, అడ్మిషన్‌లను దృష్టిలో ఉంచుకొని మొదట సీనియర్ ఇంటర్ జవాబు పత్రాలను దిద్ది ఆ తర్వాత జూనియర్ ఇంటర్ పత్రాలను దిద్దనున్నారు. ఈ వాల్యుయేషన్‌లోనూ అధ్యాపకులు కొవిడ్ మార్గదర్శకాలను పాటించేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. స్పాట్ వద్ద ఒక్కో ఉద్యోగికి 3 మాస్కులు, వ్యక్తిగత శానిటైజర్లు, పోలీసు పాస్‌లు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. మూల్యాంకన కేంద్రాల్లో క్యాంటీన్ సౌకర్యం సిద్ధం చేశారు. క్యాంపు కేంద్రాల్లో రోజూ శానిటైజేషన్, ఫాగింగ్ స్ర్పే‌ చేయాలని సిబ్బందికి ఆదేశాలిచ్చారు. మూల్యాంకన ప్రక్రియను నెలరోజుల్లో పూర్తి చేసి ఫలితాల విడుదలకు బోర్డు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

Tags:    

Similar News