వరంగల్, హన్మకొండలో కలిసే మండలాలు ఇవే..
దిశ ప్రతినిధి, వరంగల్ : ఓరుగల్లు చారిత్రక పట్టణం వరంగల్, హన్మకొండ జిల్లాలుగా ఏర్పాటవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏయే మండలాలు ఏ జిల్లాలోకి వెళ్లనున్నాయనే విషయంపై ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజల్లో ఆసక్తి నెలకొంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. వరంగల్, హన్మకొండ జిల్లాల్లో మండలాలను మెర్జ్ చేస్తూ అధికారులు నివేదికను తయారు చేసినట్లుగా తెలిసింది. 1.హన్మకొండ జిల్లా : హన్మకొండ, కాజీపేట, ఐనవోలు, ధర్మసాగర్, వేలేరు, వర్ధన్నపేట, రాయపర్తి, పర్వతగిరి, హసన్పర్తి, ఎల్కతుర్తి, భీమదేవరపల్లి, కమలాపూర్ […]
దిశ ప్రతినిధి, వరంగల్ : ఓరుగల్లు చారిత్రక పట్టణం వరంగల్, హన్మకొండ జిల్లాలుగా ఏర్పాటవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏయే మండలాలు ఏ జిల్లాలోకి వెళ్లనున్నాయనే విషయంపై ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజల్లో ఆసక్తి నెలకొంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. వరంగల్, హన్మకొండ జిల్లాల్లో మండలాలను మెర్జ్ చేస్తూ అధికారులు నివేదికను తయారు చేసినట్లుగా తెలిసింది.
1.హన్మకొండ జిల్లా : హన్మకొండ, కాజీపేట, ఐనవోలు, ధర్మసాగర్, వేలేరు, వర్ధన్నపేట, రాయపర్తి, పర్వతగిరి, హసన్పర్తి, ఎల్కతుర్తి, భీమదేవరపల్లి, కమలాపూర్ మండలాలు ఉండనున్నట్లు సమాచారం.
2.వరంగల్ జిల్లా : వరంగల్, ఖిలా వరంగల్, సంగెం, గీసుకొండ, ఆత్మకూరు, దామెర, పరకాల, నడికూడ, శాయంపేట, నర్సంపేట, నెక్కొండ, చెన్నారావుపేట, నల్లబెల్లి, దుగ్గొండి, ఖానాపురం మండలాలు ఉండే అవకాశం ఉందని అధికారుల నుంచి వస్తోన్న సమాచారం. అయితే, ఇందులో మార్పులు, చేర్పులకు అవకాశం ఉంటుందని సీఎం పరిశీలన తర్వాతే తుది నిర్ణయం ఉంటుందని అధికారులు చెబుతున్నారు.