గుప్త నిధుల కోసం క్షుద్ర పూజలు.. గ్రామస్తుల్లో భయం.. భయం

దిశ, పాలేరు: గుప్త నిధుల మోజు ఎప్పటికీ వెంటాడుతూనే ఉంటుంది. దీని కోసం ఎంతదూరమైనా వెడతారు, దేనికైనా తెగిస్తారు. తాజాగా ఖమ్మంలో గుప్త నిధుల కోసం క్షుద్ర పూజలు, శాంతి పూజలు చేసిన ఘటన వెలుగు చూసింది.. వివరాల్లోకి వెళితే.. నేలకొండపల్లి మండలంలోని కొంగర గ్రామ స్టేజీ సమీపంలో చెందిన ఓ రైతు పొలంలో గుప్త నిధుల కోసం క్షుద్రపూజలు నిర్వహించారు. పాత బుద్దారం గ్రామంలో ఉన్న అభయాంజనేయ స్వామి విగ్రహం వద్ద లంకె బిందెల కోసం […]

Update: 2021-11-05 08:24 GMT

దిశ, పాలేరు: గుప్త నిధుల మోజు ఎప్పటికీ వెంటాడుతూనే ఉంటుంది. దీని కోసం ఎంతదూరమైనా వెడతారు, దేనికైనా తెగిస్తారు. తాజాగా ఖమ్మంలో గుప్త నిధుల కోసం క్షుద్ర పూజలు, శాంతి పూజలు చేసిన ఘటన వెలుగు చూసింది.. వివరాల్లోకి వెళితే.. నేలకొండపల్లి మండలంలోని కొంగర గ్రామ స్టేజీ సమీపంలో చెందిన ఓ రైతు పొలంలో గుప్త నిధుల కోసం క్షుద్రపూజలు నిర్వహించారు. పాత బుద్దారం గ్రామంలో ఉన్న అభయాంజనేయ స్వామి విగ్రహం వద్ద లంకె బిందెల కోసం పూజారి దంపతులతో గురువారం అర్ధరాత్రి ఈ అమావాస్య పూజ తతంగం నిర్వహించినట్లు తెలుస్తోంది. క్షుద్రపూజలకు భంగం కలగకుండా కాపలాగా రోడ్డుపై మరి కొంతమందిని మోహరించారని సమాచారం.

శుక్రవారం ఉదయం వీటిని గమనించిన గ్రామస్తులు భయాందోళనకు గురౌతున్నారు. ఓ గ్రామానికి చెందిన ముగ్గురు, అలాగే అదే మండలానికి చెందిన ఇద్దరు పూజారి దంపతుల సహాయంతో ప్రత్యేక పూజలు, అడుగడుగునా పిండితో తయారు చేసిన బొమ్మలు, ముగ్గు వేసి గొబ్బెమ్మలను అలంకరించారు. గడ్డపార,పారా, గుణపాలకు పూజలు నిర్వహించారు. దీనికి ఊతమిస్తూ కొన్ని రోజుల క్రితం నుంచి ఒక‌రు వచ్చి గుప్త నిధుల కోసం పూజలు చేస్తున్నారని గ్రామంలో ప్రచారం జ‌రుగుతోంది. మ‌రోవైపు.. గుప్తనిధులు ఉన్నాయన్న అత్యాశతో క్షుద్ర పూజలు చేశారన్న విషయం ఇప్పుడు క‌ల‌క‌లం రేపుతోంది. గడిచిన వారం రోజులుగా ఈ తంతు కొనసాగుతుందని తెలుస్తోంది. నిజంగానే లంకె బిందెలు ఉన్నాయా? మరేదైనా కారణం ఉందా? అనే విషయాలపై ఇప్పడు సస్పెన్స్ నెలకుంది.

Tags:    

Similar News