ఆడపిల్ల.. తగ్గేదే లే!
దిశ, సినిమా : ఆడపిల్ల పెళ్లి గురించి తెగ ఆందోళన చెందే కుటుంబీకులు.. ఎప్పుడెప్పుడు మ్యారేజ్ చేసి పంపిద్దామా! అని ఆలోచిస్తుంటారు. కొంచెం లేట్ అయినా సరే.. జాతకం, నక్షత్రం అంటూ కళ్యాణ యోగం కోసం ఉంగరాలు పెట్టిస్తుంటారు. ఎన్ని చదువులు చదివి, ఎంత పెద్ద ఉద్యోగం చేస్తే ఏం లాభం.. కూతురిని ఇండిపెండెంట్‌గా ఉండనీకుండా పెళ్లి పేరుతో టెన్షన్ పెట్టేస్తారు. అలాంటి అమ్మాయి కథే ‘నంబర్ 9’. మ్యారేజ్ జరగాలంటే జన్మనక్షత్రం ప్రకారం ఉంగరం ధరించాలని […]
దిశ, సినిమా : ఆడపిల్ల పెళ్లి గురించి తెగ ఆందోళన చెందే కుటుంబీకులు.. ఎప్పుడెప్పుడు మ్యారేజ్ చేసి పంపిద్దామా! అని ఆలోచిస్తుంటారు. కొంచెం లేట్ అయినా సరే.. జాతకం, నక్షత్రం అంటూ కళ్యాణ యోగం కోసం ఉంగరాలు పెట్టిస్తుంటారు. ఎన్ని చదువులు చదివి, ఎంత పెద్ద ఉద్యోగం చేస్తే ఏం లాభం.. కూతురిని ఇండిపెండెంట్‌గా ఉండనీకుండా పెళ్లి పేరుతో టెన్షన్ పెట్టేస్తారు. అలాంటి అమ్మాయి కథే ‘నంబర్ 9’.
మ్యారేజ్ జరగాలంటే జన్మనక్షత్రం ప్రకారం ఉంగరం ధరించాలని చెప్తాడు జ్యోతిష్యుడు. అమ్మాయికి ఇలాంటి పట్టింపులేం లేపోయినా.. తల్లి మాత్రం అవే ఫాలో అవుతుంది. అయితే కార్పొరేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ.. వర్క్ ప్లే్స్‌లో సెక్సువల్ హరాస్‌మెంట్‌ను అడ్డుకునేందుకు ఓ యాప్ కూడా డెవలప్ చేసిన ఆ ఇంటెలిజెంట్ గర్ల్‌తో కొలీగ్ ప్రేమలో పడతాడు. తనను తల్లికి పరిచయం చేసేందుకు తీసుకెళ్లగా.. అమ్మాయిని అవమానించి పంపిస్తుంది. కానీ అదే కుటుంబానికి ఆపదొస్తే ఎలా అండగా నిలిచింది? ఉంగరం లేకుండానే పెళ్లి చేసుకుందా లేదా? అనేది కథ.