రేపు ఇంటర్ కాలేజీల బంద్‌కు NSUI పిలుపు
దిశ, గోదావరిఖని : తెలంగాణలో ఇంటర్మీడియేట్ ఫలితాలలో జరిగిన తప్పిదాలకు నిరసనగా సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ కాలేజీల బంద్‌కు పిలుపునిస్తున్నట్టు NSUI పెద్దపల్లి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్ము అభిలాష్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యం వల్ల బలైన విద్యార్థులకు న్యాయం కోసం NSUI పోరాడుతుంటే ఇంటర్మీడియేట్ బోర్డు కనీసం స్పందించకుండా పోలీసులను అడ్డం పెట్టుకొని వాళ్ళ తప్పులను కప్పిపుచ్చుకోవడంపై ఫైరయ్యారు. అలాగే ఇంటర్ బోర్డులో అధికారులను కలిసేందుకు వెళ్ళిన NSUI […]
దిశ, గోదావరిఖని : తెలంగాణలో ఇంటర్మీడియేట్ ఫలితాలలో జరిగిన తప్పిదాలకు నిరసనగా సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ కాలేజీల బంద్‌కు పిలుపునిస్తున్నట్టు NSUI పెద్దపల్లి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్ము అభిలాష్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యం వల్ల బలైన విద్యార్థులకు న్యాయం కోసం NSUI పోరాడుతుంటే ఇంటర్మీడియేట్ బోర్డు కనీసం స్పందించకుండా పోలీసులను అడ్డం పెట్టుకొని వాళ్ళ తప్పులను కప్పిపుచ్చుకోవడంపై ఫైరయ్యారు.
అలాగే ఇంటర్ బోర్డులో అధికారులను కలిసేందుకు వెళ్ళిన NSUI బృందాన్ని, రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్‌ను పోలీసులు అరెస్టు చేయడం హేయమైన చర్య అని అన్నారు. విద్యార్థుల ఆత్మహత్యలకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం, ఇంటర్ బోర్డు తీరుకు నిరసనగా 20వ తేదీన రాష్ట్రవ్యాప్త ఇంటర్మీడియేట్ కాలేజీల బంద్‌ను విజయవంతం చేయాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. వెంటనే ప్రభుత్వం తన తీరును మార్చుకొని విద్యార్థులకు న్యాయం చేయాలని.. లేకపోతే ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు.