కాళ్లు లేకపోతేనేం.. కల సాకారం చేసుకున్న ముంబైకర్

దిశ, ఫీచర్స్ : రోజుమాదిరిగానే ఆ రోజు (11 జులై 2006న) సాయంత్రం 21 ఏళ్ల చిరాగ్ చౌహాన్.. ముంబైలోని తన ఆఫీసులో డ్యూటీ ముగించుకుని ఇంటికి బయలుదేరాడు. కానీ సరిగ్గా అప్పుడే (సా. 6.20 గంటల ప్రాంతంలో) ముంబై సిటీలో జరిగిన వరుస పేలుళ్లు అతడి జీవితాన్ని పూర్తిగా మార్చేశాయి. ఆ ప్రమాదంలో చిరాగ్ వెన్నుపూస దెబ్బతినడంతో తన రెండు కాళ్లు చచ్చుబడిపోయాయి. దీంతో వీల్ చైర్‌కే పరిమితం కావాల్సి వచ్చింది. ఈ పరిస్థితుల్లోనూ ఆత్మవిశ్వాసం […]

Update: 2021-03-18 02:25 GMT

దిశ, ఫీచర్స్ : రోజుమాదిరిగానే ఆ రోజు (11 జులై 2006న) సాయంత్రం 21 ఏళ్ల చిరాగ్ చౌహాన్.. ముంబైలోని తన ఆఫీసులో డ్యూటీ ముగించుకుని ఇంటికి బయలుదేరాడు. కానీ సరిగ్గా అప్పుడే (సా. 6.20 గంటల ప్రాంతంలో) ముంబై సిటీలో జరిగిన వరుస పేలుళ్లు అతడి జీవితాన్ని పూర్తిగా మార్చేశాయి. ఆ ప్రమాదంలో చిరాగ్ వెన్నుపూస దెబ్బతినడంతో తన రెండు కాళ్లు చచ్చుబడిపోయాయి. దీంతో వీల్ చైర్‌కే పరిమితం కావాల్సి వచ్చింది. ఈ పరిస్థితుల్లోనూ ఆత్మవిశ్వాసం కోల్పోని చిరాగ్.. అకుంఠిత దీక్ష, పట్టుదలతో తన లక్ష్యాన్ని ఛేదించాడు. ఈ క్రమంలో తన సీఏ కలను సాకారం చేసుకున్నాడు. అసలు తన కాళ్లతో సరిగ్గా రెండు అడుగులు కూడా నడవలేని చిరాగ్‌కు ఏ విధంగా అనుకున్నది సాధించాడు? వీల్ చైర్‌కు పరిమితమైన తను లైఫ్‌ను ఎలా లీడ్ చేయగలుగుతున్నాడు? ఈ స్టోరీ చదివి తెలుసుకుందాం.

18 ఏళ్ల వయసులోనే తండ్రిని కోల్పోయిన చిరాగ్.. తల్లి ప్రోత్సాహంతో కష్టపడి చదివాడు. సీఏ సెకండ్ లెవల్ ఎగ్జామ్ క్లియర్ చేసి ఆర్టికల్‌షిప్ చేస్తున్న క్రమంలోనే తన జీవితంలో అనుకోని ఉపద్రవం ఎదురైంది. ముంబైలోని రైల్వే స్టేషన్‌లో జరిగిన పేలుళ్లకు గురై, రెండు కాళ్లు చచ్చుబడిపోవడంతో అతడి జీవితంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆరునెలల పాటు మంచానికే పరిమితమయ్యాడు. అయినా ఏ మాత్రం ఆత్మవిశ్వాసాన్ని కోల్పోని చిరాగ్.. లైఫ్‌లో మూవ్ ఆన్ కావాల్సిందేనని డిసైడ్ అయి, సీఏ కావాలన్న తన డ్రీమ్ కోసం మళ్లీ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాడు.

ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన చిరాగ్.. సీఏ మీదున్న ఆసక్తితో టైమ్ మేనేజ్ చేసుకుంటూ ఫిజియోథెరపీ సెషన్స్‌కు అటెండ్ అవుతూనే, ప్రిపేర్ అవుతూ వచ్చాడు. వీల్‌చైర్‌లో ఉంటూనే రోజుకు 7 గంటల పాటు చదువుకున్నాడు. మొత్తంగా ఐసీఏఐ(ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా) ఎగ్జామ్స్ క్లియర్ చేసి ఎట్టకేలకు సీఏ అయ్యాడు. అయితే సీఏగా వర్క్ చేయడం కోసం పలు సంస్థలకు అప్లై చేయగా, తన వైకల్యం (దివ్యాంగుడు) కారణంగా కొందరు తిరస్కరించారు. చివరకు ఒకచోట సీఏగా పనిచేసేందుకు అవకాశం రావడంతో తన టాలెంట్‌ను ప్రూవ్ చేసుకున్నాడు. ప్రస్తుతం సీఏ ఆస్పిరెంట్స్‌కు ఎగ్జామ్ క్లియరెన్స్‌పై పలు సూచనలిస్తున్న చిరాగ్.. టైమ్ మేనేజ్‌మెంట్‌, స్వాట్ అనాలసిస్(స్ట్రెంత్, వీక్‌నెస్, ఆపర్చునిటీస్, త్రెట్స్)తో పాటు పాజిటివ్ ఎన్విరాన్మెంట్‌లో చదువుకోవాలని వారికి చెప్తున్నాడు.

‘గాయాల నుంచి బయటపడటానికి తనకు చాలా సమయం పట్టింది, ప్రస్తుతం వీల్ చైర్‌లో ఉన్నప్పటికీ నా పనులు నేను ఈజీగా చేసుకోగలుగుతున్నా. అయితే ఆ స్టేజ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత తనను ఎవరూ పారాప్‌లెగిక్(కాళ్లు, మోకాళ్లు, చచ్చుబడిపోవడం) అని ఒక్కసారి కూడా పిలవలేదు’ అని చెప్పుకొచ్చాడు చిరాగ్.

Tags:    

Similar News