బీఎస్సీ నర్సింగ్ డిగ్రీ ప్రవేశాలకు నోటిఫికేషన్

దిశ, తెలంగాణ బ్యూరో: బీఎస్సీ, పీబీబీఎస్సీ నర్సింగ్‌, బీపీటీ , బీఎస్సీ ఎంఎల్‌టి డిగ్రీ కోర్సుల్లోని ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నది. ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లో కన్వీనర్ కోటా సీట్లను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్​ విడుదల చేసింది. ఈ నెల 6 నుంచి 15వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తామని పేర్కొన్నది. నాలుగేళ్ల డిగ్రీ కోర్సు బ్యాచిలర్ ఆఫ్ నర్సింగ్ (బీఎస్సీ నర్సింగ్ ), రెండు సంవత్సరాల […]

Update: 2021-12-04 07:28 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: బీఎస్సీ, పీబీబీఎస్సీ నర్సింగ్‌, బీపీటీ , బీఎస్సీ ఎంఎల్‌టి డిగ్రీ కోర్సుల్లోని ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నది. ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లో కన్వీనర్ కోటా సీట్లను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్​ విడుదల చేసింది. ఈ నెల 6 నుంచి 15వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తామని పేర్కొన్నది. నాలుగేళ్ల డిగ్రీ కోర్సు బ్యాచిలర్ ఆఫ్ నర్సింగ్ (బీఎస్సీ నర్సింగ్ ), రెండు సంవత్సరాల డిగ్రీ కోర్సు పోస్ట్ బేసిక్ బ్యాచిలర్ ఆఫ్ నర్సింగ్ (పీబీబీఎస్సీ నర్సింగ్‌), బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపి ( బీపీటీ ), బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ఇన్ మెడికల్ ల్యాబరేటరీ టెక్నాలజీ ( బీఎస్సీ ఎంఎల్‌టీ ) కోర్సుల్లోని ప్రవేశాల కొరకు అర్హత గల వారు దరఖాస్తు చేయాలని హెల్త్​ యూనివర్సిటీ స్పష్టం చేసింది. మరిన్ని వివరాలకు యూనివర్సిటీ వెబ్‌సైట్ www.knruhs.telangana.gov.inలో చూడాలని యూనివర్సిటీ వర్గాలు స్పష్టం చేశాయి.

Tags:    

Similar News