TGSRTC: కారు డోర్‌ తీసేటప్పుడు జాగ్రత్త..! వీసీ సజ్జనార్ ఆసక్తికర ట్వీట్

తొందరంగా వెళ్లాలనే హడావుడిలో ప్రమాదాలకు(Accidents) కారణం కావద్దు అని టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్(TGSRTC MD VC Sajjanar) సూచించారు.

Update: 2025-01-04 10:08 GMT

దిశ, వెబ్ డెస్క్: తొందరంగా వెళ్లాలనే హడావుడిలో ప్రమాదాలకు(Accidents) కారణం కావద్దు అని టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్(TGSRTC MD VC Sajjanar) సూచించారు. రోడ్డు ప్రమాదాలపై(Road Accidents) సోషల్ మీడియా(Social Media) వేదికగా నిరంతరం అవగాహన కల్పించే సజ్జనార్.. ట్విట్టర్ లో ఆసక్తికర పోస్ట్ పెట్టారు. ఆయన పోస్ట్ చేసిన వీడియోలో ఓ కారు నడి రోడ్డుపై ఆపి, అకస్మాత్తుగా కారు డోర్ తీయడం వల్ల వెనుక నుంచి వచ్చిన ఓ ద్విచక్ర వాహనం దానికి తగిలి పడిపోతుంది. దీనిపై సజ్జనార్.. ఇదేం నిర్లక్యం.. కనీస మానవత్వం కూడా లేదా!? అని ప్రశ్నించారు. నడిరోడ్డుపై వాహనాన్ని ఆపి.. కారు డోరు తెరవడమే తప్పు అని, తమ నిర్లక్ష్యంతో ప్రమాదం జరిగిందనే సోయి లేకుండా.. తమకేం పట్టనట్టు ఎలా ప్రవర్తించారో చూడండి అని అన్నారు. ఈ ప్రమాదం న్యూ ఇయర్(New Year) నాడు దేశ రాజదాని న్యూఢిల్లీ(New Delhi)లో జరిగిందని, కారు డోర్‌ తీసేటప్పుడు జాగ్రత్త! అని హెచ్చరించారు. అంతేగాక వెనుక నుంచి వస్తున్న వాహనదారులను గుర్తించి.. కారు డోర్‌ తీయండి అని, తొందరగా వెళ్లాలనే హడావుడిలో ఇలా అజాగ్రత్త, నిర్లక్ష్యంగా వ్యవహారించి ప్రమాదాలకు కారణం కాకండి అని రాసుకొచ్చారు.

https://x.com/SajjanarVC/status/1875469208953192625

Tags:    

Similar News