ఆహ్వానిస్తూనే ఆరోపణలు చేస్తున్నారు
న్యూఢిల్లీ: సచిన్ పైలట్‌పట్ల బుధవారం కాంగ్రెస్ పార్టీ భిన్న ధోరణులు అవలంభించింది. సచిన్ పైలట్ తిరిగి రావాలని, ఆయనకు కాంగ్రెస్ కుటుంబ ద్వారాలు ఎప్పుడూ తెరిచే ఉంటాయని పార్టీ సీనియర్ నేత రణదీప్ సుర్జేవాల మరోసారి ఆహ్వానించారు. కాగా, రాజస్తాన్ సీఎం అశోక్ గెహ్లాట్ మాత్రం సచిన్‌పై ఆరోపణలతో విరుచుకుపడ్డారు. బీజేపీ 20 కోట్ల ఆఫర్లు ఇచ్చిందని, ఎమ్మెల్యేల బేరసారాలు జరిగాయని అన్నారు. అంతేకాదు, స్వయంగా సచిన్ పైలట్ ఈ డీల్‌లో ఉన్నారని, అందుకు ఆధారాలు తమ […]
న్యూఢిల్లీ: సచిన్ పైలట్‌పట్ల బుధవారం కాంగ్రెస్ పార్టీ భిన్న ధోరణులు అవలంభించింది. సచిన్ పైలట్ తిరిగి రావాలని, ఆయనకు కాంగ్రెస్ కుటుంబ ద్వారాలు ఎప్పుడూ తెరిచే ఉంటాయని పార్టీ సీనియర్ నేత రణదీప్ సుర్జేవాల మరోసారి ఆహ్వానించారు. కాగా, రాజస్తాన్ సీఎం అశోక్ గెహ్లాట్ మాత్రం సచిన్‌పై ఆరోపణలతో విరుచుకుపడ్డారు. బీజేపీ 20 కోట్ల ఆఫర్లు ఇచ్చిందని, ఎమ్మెల్యేల బేరసారాలు జరిగాయని అన్నారు. అంతేకాదు, స్వయంగా సచిన్ పైలట్ ఈ డీల్‌లో ఉన్నారని, అందుకు ఆధారాలు తమ దగ్గర ఉన్నాయని ఆరోపించారు. బీజేపీతో డీలింగ్ పెట్టుకుని కొత్త పార్టీ ఓపెన్ చేసే యోచనలో ఉన్నారని ఆరోపణలు చేశారు. ఆ సొమ్ము తీసుకున్నవారే ఇప్పుడు మనేసర్ హోటల్‌లో ఉన్నారని చెప్పారు.
పీసీసీ ప్రెసిడెంట్, డిప్యూటీ సీఎంగా అతన్ని తొలగించిన తర్వాత కూడా తాను బీజేపీలో చేరడం లేదని మరోసారి సచిన్ పైలట్ స్పష్టం చేశారు. రాజస్తాన్‌లో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి రావడానికి చాలా కష్టపడ్డారని చెప్పుకొచ్చారు. గాంధీలతో సాన్నిహిత్యాన్ని చెడగొట్టడానికే కొందరు కాంగ్రెస్ నేతలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. ఈ వ్యాఖ్యల తర్వాతే రణదీప్ సుర్జేవాలా స్పందిస్తూ బీజేపీలో చేరే యోచనలేని కాంగ్రెస్ నేతలు వెంటనే బీజేపీ వసతి కల్పిస్తున్న హోటల్ వదిలి కుటుంబంలో చేరాలని అన్నారు. అశోక్ గెహ్లాట్‌కు 106 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నదని ఆయన వర్గీయులు తెలిపారు. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీలో బలనిరూపణను తాము ఇప్పుడు డిమాండ్ చేయడం లేదని బీజేపీ స్పష్టం చేసింది.
రెబెల్ ఎమ్మెల్యేలకు నోటీసులు
పైలట్ సహా 19 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటువేయాలని కాంగ్రెస్ అభ్యర్థించిన తర్వాత రెబల్ ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు జారీ చేశారు. శుక్రవారంలోపు వివరణ ఇవ్వాలని స్పీకర్ ఆదేశించారు. సచిన్ పైలట్ అనుచరులు లేకుండా కాంగ్రెస్ పార్టీ జాగ్రత్తలు తీసుకుంటున్నది. క్యాబినెట్ నుంచి ఆయన అనయాయులను తొలగించడమే కాదు, జిల్లా స్థాయి, బ్లాక్ స్థాయి కాంగ్రెస్ కమిటీలను తొలగించింది. పార్టీని పునర్నిర్మించడంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు కాంగ్రెస్ నేతలు చెబుతున్నా.. సచిన్ వర్గీయులను తొలగించాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారని రాజకీయ విశ్లేషకులు చెప్పారు.