నోరు విప్పని ఉత్తర కొరియా
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ ఆరోగ్యం విషమించిందని ప్రపంచ వ్యాప్తంగా ఊహాగానాలు చెలరేగుతున్నాయి. అయితే ఆ దేశం మాత్రం ఇప్పటి వరకు ఎటువంటి ప్రకటన చేయకపోవడం గమనార్హం. అయితే అక్కడి మీడియాలో మాత్రం కిమ్‌ను ప్రశంసిస్తూ వార్త కథనాలు ప్రసారం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో కిమ్ ఆరోగ్య పరిస్థితిపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు. కిమ్ ఆరోగ్యంపై వస్తున్న వార్తలు నిజమో కాదో తనకు తెలియదన్నారు. అయితే కిమ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. […]
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ ఆరోగ్యం విషమించిందని ప్రపంచ వ్యాప్తంగా ఊహాగానాలు చెలరేగుతున్నాయి. అయితే ఆ దేశం మాత్రం ఇప్పటి వరకు ఎటువంటి ప్రకటన చేయకపోవడం గమనార్హం. అయితే అక్కడి మీడియాలో మాత్రం కిమ్‌ను ప్రశంసిస్తూ వార్త కథనాలు ప్రసారం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో కిమ్ ఆరోగ్య పరిస్థితిపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు. కిమ్ ఆరోగ్యంపై వస్తున్న వార్తలు నిజమో కాదో తనకు తెలియదన్నారు. అయితే కిమ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు.
కాగా, ఏప్రిల్ 15న ఉత్తర కొరియా వ్యవస్థాపకుడు ఇల్ సంగ్ జయంతి ఉత్సవాల్లో కిమ్ పాల్గొనకపోవడంతో ఆయన ఆరోగ్యంపై పలు అనుమానాలకు తావిచింది.చైన్ స్మోకింగ్ , పని ఒత్తిడి, ఊబకాయంతో కిమ్ తీవ్ర అనారోగ్యం పాలయ్యారని సమాచారం. ప్రస్తుతం ఆయన ప్యాంగ్యాంగ్ సమీపంలోని ఓ రిసార్ట్‌లో చికిత్స తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
Tags: North Korea, President, Kim Jong Un, health, media, trump