ఏలూరు మేయర్‌గా నూర్జహాన్
దిశ, ఏపీ బ్యూరో: ఏలూరు కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం సృష్టించింది. భారీ మెజార్టీతో ఏలూరు కార్పొరేషన్‌ను వైసీపీ కైవసం చేసుకుంది. 50 డివిజన్లకు గాను 47 డివిజన్లలో వైసీపీ గెలుపొందింది. ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ కేవలం 3 స్థానాలకే పరిమితమైంది. దీంతో మేయర్ పీఠాన్ని వైసీపీ దక్కించుకుంది. అయితే ఈసారి రిజర్వేషన్ ప్రకారం ఏలూరు మేయర్ పదవిని జనరల్ మహిళకు కేటాయించారు. దీంతో వైసీపీ మేయర్ అభ్యర్థిగా మాజీ మేయర్ షేక్ నూర్జహాన్ పేరును వైసీపీ […]
దిశ, ఏపీ బ్యూరో: ఏలూరు కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం సృష్టించింది. భారీ మెజార్టీతో ఏలూరు కార్పొరేషన్‌ను వైసీపీ కైవసం చేసుకుంది. 50 డివిజన్లకు గాను 47 డివిజన్లలో వైసీపీ గెలుపొందింది. ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ కేవలం 3 స్థానాలకే పరిమితమైంది. దీంతో మేయర్ పీఠాన్ని వైసీపీ దక్కించుకుంది. అయితే ఈసారి రిజర్వేషన్ ప్రకారం ఏలూరు మేయర్ పదవిని జనరల్ మహిళకు కేటాయించారు.
దీంతో వైసీపీ మేయర్ అభ్యర్థిగా మాజీ మేయర్ షేక్ నూర్జహాన్ పేరును వైసీపీ అధిష్టానం ఖరారు చేసింది. 50 డివిజన్ నుంచి నూర్జహాన్ బేగం పోటీ చేసి విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థిపై 570 ఓట్లు ఆధిక్యతతో గెలుపొందారు. అయితే మేయర్ అభ్యర్థిత్వాన్ని ఆశించిన వారిని సంవత్సరానికి ఒకరు చొప్పున ఐదుగురు డిప్యూటీ మేయర్లను కూడా వైసీపీ ప్రకటించింది. ఇకపోతే ఈనెల 30న అధికారికంగా మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక జరగనుంది.