భారత్-లండన్ మధ్య నాన్‌స్టాప్ విమానాలు!

దిశ, వెబ్‌డెస్క్: భారత్-లండన్ మధ్య తిరిగే విమానాలకు సంబంధించిన షెడ్యూల్‌ను సోమవారం ప్రకటించారు. ఈ సందర్భంగా స్పైస్‌జెట్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అజయ్ సింగ్ మీడియాతో మాట్లాడారు. వారంలో మూడు రోజులు భారత్-లండన్‌ల మధ్య నాన్‌స్టాప్ విమానాలు నడపనున్నట్టు ప్రకటించారు. డిసెంబర్ 4 నుంచి ప్రయాణికులకు ఈ విమాన సర్వీసులు అందుబాటులోకి వస్తాయని వెల్లడించారు. ప్రతి శుక్ర, ఆదివారాలలో మధ్యాహ్నం 1 గంటకు ఢిల్లీ నుంచి స్పైస్‌జెట్ విమానం లండన్‌కు బయల్దేరుతుందని తెలిపారు. ఈ విమానం అదే […]

Update: 2020-10-05 09:34 GMT

దిశ, వెబ్‌డెస్క్: భారత్-లండన్ మధ్య తిరిగే విమానాలకు సంబంధించిన షెడ్యూల్‌ను సోమవారం ప్రకటించారు. ఈ సందర్భంగా స్పైస్‌జెట్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అజయ్ సింగ్ మీడియాతో మాట్లాడారు. వారంలో మూడు రోజులు భారత్-లండన్‌ల మధ్య నాన్‌స్టాప్ విమానాలు నడపనున్నట్టు ప్రకటించారు. డిసెంబర్ 4 నుంచి ప్రయాణికులకు ఈ విమాన సర్వీసులు అందుబాటులోకి వస్తాయని వెల్లడించారు.

ప్రతి శుక్ర, ఆదివారాలలో మధ్యాహ్నం 1 గంటకు ఢిల్లీ నుంచి స్పైస్‌జెట్ విమానం లండన్‌కు బయల్దేరుతుందని తెలిపారు. ఈ విమానం అదే రోజు సాయంత్రం 5.30 గంటలకు (స్థానిక సమయం) లండన్ చేరుతుందని చెప్పారు. ముంబై నుంచి లండన్ వెళ్లే నాన్‌స్టాప్ విమానం ప్రతి సోమవారం మధాహ్నం 12.45 గంటలకు ప్రయాణికులకు అందుబాటులో ఉంటుందని చెప్పారు.

ఈ విమానం కూడా స్థానిక సమయం ప్రకారం.. సాయంత్రం 5.30 గంటలకు లండన్ చేరుతుందని వివరించారు. ఇదే విధంగా ప్రతి సోమ, శుక్రవారాలలో సాయంత్రం 7.30 గంటలకు లండన్ నుంచి ఒక విమానం ఢిల్లీకి బయల్దేరుతుందని.. ప్రతి ఆదివారం సాయంత్రం 7.30 గంటలకు నాన్‌స్టాప్ విమానం ముంబైకి పయనమవుతుందన్నారు. కాగా.. ఇరు దేశాల మధ్య కుదిరిన ‘ఎయిర్ బబుల్’ ఒప్పందంలో భాగంగానే ఈ నాన్‌స్టాప్ విమానాలను ప్రయాణికులకు అందుబాటులోకి తెచ్చామని అజయ్ సింగ్ స్పష్టం చేశారు.

Tags:    

Similar News