Tashi Namgyal: పాక్ చొరబాటుపై ఉప్పు అందించిన గొర్రెల కాపరి ఇకలేరు

కార్గిల్ ఆక్రమణ(1999 Kargil conflict) కోసం పాక్ పన్నిన కుట్రను పసిగట్టి సైన్యాన్ని అప్రమత్తం చేసిన గొర్రెల కాపరి ఇకలేరు.

Update: 2024-12-21 04:57 GMT

దిశ, నేషనల్ బ్యూరో: కార్గిల్ ఆక్రమణ(1999 Kargil conflict) కోసం పాక్ పన్నిన కుట్రను పసిగట్టి సైన్యాన్ని అప్రమత్తం చేసిన గొర్రెల కాపరి ఇకలేరు. 1999లో పాక్ చొరబాటు సమచారాన్ని(Pakistan's intrusion in the Kargil sector) సేకరించిన గొర్రెల కాపరే  తాషి నామ్ గ్యాల్ (Tashi Namgyal). కాగా.. ఆయన ఆకస్మికంగా చనిపోయినట్లు భద్రతాబలగాలు పోస్టు పెట్టాయి. ఆర్య‌న్ వ్యాలీలో ఆయన కన్నుమూశారని వెల్లడించింది. తాషి మృతిపై భార‌త సైన్యం తీవ్ర దిగ్భ్రాంతి వ్య‌క్తం చేసింది. “58 ఏళ్ల తాషి నామ్‌గ్యాల్ లఢక్‌లోని ఆర్య‌న్ వ్యాలీలో చనిపోయారు. ఓ దేశ భ‌క్తుడిని కోల్పోయాం.. ఆయ‌న ఆత్మ‌కు శాంతి చేకూరాలి. 1999 ఆప‌రేష‌న్ విజ‌య్(Operation Vijay in 1999) స‌మ‌యంలో తాషి అందించిన స‌హ‌కారం చ‌రిత్ర పుట‌ల్లో సువ‌ర్ణాక్ష‌రాల‌తో లిఖించి ఉంటుంది. ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌కు ప్ర‌గాఢ సానుభూతి తెలియ‌జేస్తున్నాం” అని ఫైర్ అండ్ ప్యూరీ కార్ప్స్ సోష‌ల్ మీడియాలో పోస్టు చేసింది.

కార్గిల్ యుద్ధంలో కీలక పాత్ర

మరోవైపు, కార్గిల్ విజ‌య దివ‌స్‌కు 25 ఏళ్లు పూర్త‌యిన సంద‌ర్భంగా ఈ ఏడాది ద్రాస్‌లో నిర్వ‌హించిన వేడుక‌ల‌కు తాషి హాజ‌ర‌య్యారు. 1999 మే నెల‌లో తాషికి చెందిన గొర్రెలు త‌ప్పిపోవ‌డంతో.. వాటి ఆచూకీ కోసం బ‌టాలిక్ ప‌ర్వ‌త శ్రేణిలో గాలింపు చేపట్టారు. ఈ స‌మ‌యంలో అక్క‌డ బంక‌ర్‌ల‌ను త‌వ్వుతున్న పాకిస్థాన్ సైనికులను ఆయన గమనించారు. దీంతో, తాషి వెంటనే అప్రమత్తమయ్యారు. పరిస్థితి తీవ్రతను గ్రహించిన అతను వెంటనే భారత సైన్యానికి సమాచారం అందించాడు. భార‌త సైన్యం కూడా అప్ర‌మ‌త్త‌మై.. పాక్ చ‌ర్య‌ల‌ను విఫ‌లం చేసింది.

Tags:    

Similar News