Kejriwal : గవర్నర్ అనుమతి.. కేజ్రీవాల్‌ను విచారించనున్న ఈడీ !
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజీవాల్ ( EX CM Arvind Kejriwal)కు ఈడీ(ED) భారీ షాక్ ఇచ్చింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ(Liquor Policy Case) కేసులో కేజ్రీవాల్‌ను విచారించేందుకు ఈడీ సిద్ధమైంది.
దిశ, వెబ్ డెస్క్ : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజీవాల్ ( EX CM Arvind Kejriwal)కు ఈడీ(ED) భారీ షాక్ ఇచ్చింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ(Liquor Policy Case) కేసులో మరోసారి కేజ్రీవాల్‌ను విచారించేందుకు ఈడీ సిద్ధమైంది. ఈనెల 5వ తేదీన కేజ్రీవాల్ ను విచారించేందుకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్(LG)ని ఈడీ అనుమతి కోరింది. ఈడీ అభ్యర్థనకు లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా అనుమతించారు. దీంతో కేజ్రీవాల్ విచారణకు ఈడీ సిద్ధమవుతోండటంతో లిక్కర్ పాలసీ కేసు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ముుందు మరోసారి రాజకీయ సెగలను రేపుతోంది. ఫిబ్రవరి రెండో వారంలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరిగే అవకాశం ఉంది.
ఇప్పటికే ఆప్ తన అభ్యర్థులను సైతం ప్రకటించి ఎన్నికల సమర శంఖం పూరించింది. ఈ పరిస్థితుల్లో లిక్కర్ కేసులో మరోసారి కేజ్రీవాల్ ను ఈడీ విచారించనుండటాన్ని ఆప్ పార్టీ జీర్ణించుకోలేకపోతోంది. కేజ్రీవాల్ ప్రభుత్వంలో ఎక్సైజ్ పాలసీని రూపొందించడంతో పాటు అమలు చేయడంలో భారీ అవినీతి జరిగిందని ఈడీ అభియోగాలు మోపిన సంగతి విదితమే.
మద్యం పాలసీకి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ ను ఈ ఏడాది మార్చి 21వ తేదీన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసింది. ఈ కేసులో కేజ్రీవాల్ కు జూలై 12న సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. సెప్టెంబర్ 13న సుప్రీంకోర్టు షరతులతో కూడిన బెయిల్ ను ఇవ్వడంతో ఆయన ఆరు నెలలు శిక్ష అనుభవించిన తర్వాత తీహార్ జైలు నుంచి రిలీజ్ అయ్యారు.